సోమవారం 28 జూలై 2008

‘ఫ్రెషర్స్ డే’ రిపోర్ట్

కొద్దిరోజుల నుండి ‘కూడలి కా ఖోజ్’ అనే కార్యక్రమం ప్రారంభించి మంచి మంచి బ్లాగులను గుర్తించి నా ‘బ్లాగ్ లిస్ట్’లో చేర్చడం మొదలుపెట్టాను. అది ఇంకా పూర్తవలేదు లెండి. కానీ రాత్రి 'కూడలి కబుర్ల 'లో ‘ఖోజ్’ చెయ్యవలసింది బ్లాగుల కావల చాలా ఉన్నదని తెలిసింది.

కూడలి కబుర్లలో ‘తెలుగు బ్లాగర్ల ఫ్రెషర్స్ డే’ సందర్భంగా కొన్ని నిర్ణయాలు జరిగాయి. తెలుగు బ్లాగర్లలో జూనియర్, సీనియర్ అనేటటువంటి తేడాలేవీ లేవనీ..అంతా సమానమేననీ. ఇక కొత్త బ్లాగర్లకు మార్గదర్శకంగా ఉండటానికి వీలుగా కూడలిలో ఓ పేజీ కేటాయించి దానిలో ‘త.వ.స.’ (తరచుగా వచ్చే సందేహాలు) అంటే ‘వర్డ్ వెరిఫికేషన్’ లాంటి వివరణలు..ఇంకా ఇలాంటి విషయాలు ఉండాలని నిర్ణయించారు. ఇంకా ‘ఫండ్ రైజింగ్’..అలానే మరికొన్ని సాంకేతిక విషయాల మీద చర్చలు జరిగాయి.

ముందుగా ఛలోక్తులు, తరువాత బ్లాగర్ల పరిచయ కార్యక్రమం, తరువాత వివిధ విషయాల మీద చర్చ, ఆ తరువాత సందేహాలు..వాటి నివృత్తి, విజ్ఞప్తులు, వీడ్కోళ్ళు …ఇలా సమావేశం ముగిసింది.

ఇక నెలలో ప్రతి నాల్గవ ఆదివారం సాయంత్రం 6గం||కు పిలుపుతో పని లేకుండా కూడలి కబుర్లకు రావాలనీ.. రావచ్చనీ తెలియజేయబడింది.

పరిచయ కార్యక్రమం కొంత ఎక్కువ టైం తీసుకునేసరికి చివరి వరకూ అందరూ ఉండలేకపోయారు. రాత్రి జరిగినది ‘ఫ్రెషర్స్ డే’ అనే కాన్సెప్ట్ తో గనుక పరిచయ కార్యక్రమం తప్పదు. ఇక నుండి జరిగే వాటిలో ‘అందరూ ఒకరికొకరు సుపరిచితులే’అనే ప్రాతిపదికతో (కొత్త వారు తమ తమ బ్లాగుల ద్వారా పరిచయమవుతూనే ఉంటారు కదా!) ఛలోక్తులు (ఇవి ఏటూ తప్పవు) అయిన వెంటనే చర్చ ప్రారంభిస్తే అందరూ ఒకేసారి డిస్పర్స్ అవ్వచ్చు.

దిలీప్ గారి నిష్క్రమణ బావుంది.’నే వెళ్తున్నా..!వంట చేసుకోవాలి’. సో ఆయన బ్రహ్మచారి అన్న మాట.

ఒరెమూనా గారు ‘తెలుగు తెలుగు’ అని ఎవరినో హెచ్చరించారు.కానీ పూర్ణిమ గారు టింగ్లింష్‌లోనే కబుర్లాడారు. ఆ టింగ్లింష్ చాలా బావుంది.

‘muralee !Edi nijaM?’

naatO Emainaa samasyalunnaayaa?

సాలభంజికలు గారి అధ్యక్షత బావుంది. రానారె గారు రాగానే సాలభంజికలు గారు తన బాధ్యతను ఆయన కప్పగించి నిష్క్రమించారు.(తరువాత మరలా వచ్చారులేండి)

రానారే గారు రాగానే ఒరెమూనా గారు ‘రెడ్డి’ గారూ స్వాగతం అన్నారు. జ్యోతిగారు ‘రాము’ గారూ స్వాగతం అన్నారు. మిగతా ‘నారాయణ’ను నేనూహించుకున్నాను.

{కబుర్ల మధ్యలో బ్లాగింగ్ ఓ వ్యసనం అనే కోణంలో కొందరు సీనియర్ బ్లాగర్ల నుండి (సారీ..!సీనియర్,జూనియర్ అనకూడదు కదూ!)వ్యాఖ్యలు వచ్చాయి. దానితో నా మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ అంశాన్ని జ్యోతి గారితో ప్రస్తావిస్తే అది మన చేతిలోనే ఉందన్నారు. ఈ విషయం మీద నేనో టపా రాస్తాను}

గుడ్‌నైట్ చెప్పేటపుడు మీనాక్షి గారిని, మురళీధర్ గారినీ నేను సంబోధించలేక పోయాను. నేను ‘లేఖిని’ తో కుస్తీ పడుతూ కాపీపేస్ట్‌లు చేస్తున్నాను. దానికి తోడు ‘మంటనక్క’ ఒకటి లేకపోవడం. దానితో ఆలస్యమైపోతూ ఉన్నది. ‘అక్షరమాలలో రాయండి!’ అని ఉన్నది. దానితో ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకోవాలి. అందరూ స్పీడ్‌గా కబుర్లు చెప్పడానికి అక్షరమాలే కారణమనుకుంటా!

జ్యోతిగారు ‘మంటనక్క’ అన్నారు. ప్రతాప్ గారు, ప్రదీప్ గారు ‘ఫైర్ ఫాక్స్’ అన్నారు. అదే ఇదని తట్టేసరికి తెల్లారింది.

జ్యోతిగారు ‘జ్యోతక్క’ ఎందుకైనారో నాకు రాత్రే తెలిసింది.

మురళీధర్ గారు పరిచయకార్యక్రమంలో అందరి వ్యక్తిగత వివరాలు చెబితే బాగుండేది అన్నారు. పూర్ణిమ గారు వాటిని తెలుసుకుని ఎంజేస్తామన్నారు. దానికి సమాధానంగా మురళీధర్ గారు తోటి బ్లాగర్ల గురించి తెలుసుకుంటే అదో ‘తుత్తి’ అన్నారు.

ఇద్దరి అభిప్రాయాలూ నిజమే. అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు..ఇవి అనవసరం. కానీ వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, చేసే పని, ప్రస్తుత నివాసం..ఇత్యాదివి తెలిస్తే మురళీ గారు అన్నట్లు అదో ‘తుత్తే’ కదా! కనీసం వయసన్నా తెలిస్తే ఈ ‘గారె’ల (గారు) బాధ కొంతైనా తగ్గి కాస్త చనువైనా ఏర్పడుతుంది. అందుకే నా వివరాలు చెబుతున్నాను.

నన్ను సాలభంజికలు గారు సరస్వతీ పుత్రులు అన్నారు.ఆయన అర్థంలో నేను లక్ష్మీ పుత్రుడిని కూడా.ఎందుకంటే నా పూర్తి పేరు లక్ష్మీ సరస్వతీ కుమార్.

నేను పుట్టిన సంవత్సరం 1970.

నేను పుట్టి పెరిగినది,చదువుకున్నది గుంటూరు జిల్లా బాపట్లలో.

ప్రస్తుత నివాసం వైజాగ్.అచ్చ తెలుగులో విశాఖపట్నం.

21 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

Good report.

As a fairly "senior" blogger, these are some of my observations :)
1. In any internet interactions, it is frowned upon to ask for any kind of personal details including a person's name. It is up to the concerned person how much they want to disclose.
2. It is a good policy not to disclose your personal details in public forums such as blogs, blog comments and koodali kaburlu.
3. If a fellow blogger reveals soemthing to you in private communication, or you discover soemthing about them by other means, it is not okay to reveal such information in public forum.

There are a bunch of resources explaining step-by-step procedures for easy typing in Telugu. Yet, this seems to tbe the main stumbling block for many people. We should look methods of effective delivery of this information.

MURALI చెప్పారు...

ఫ్రెషర్ డే నివేదిక ఇచ్చినందుకు ధన్యవాదాలు.

నా పూర్తి పేరు: నాగ మురళీధర్ నామాల
స్వస్థలం: బొబ్బిలి, విజయనగరం జిల్లా.(కె.జి నుండి పి.జి. వరకు చదువు కూడా)
చదివినది: ఎం.సి.ఎ
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: సాఫ్ట్ వేర్ ఇంజనీర్
పుట్టిన తేది: 10/11/1983

మరో మంచి పరిచయ వేదికని అందించారు. కబుర్లలో కంటే ఇది అనువయినది అనిపిస్తుంది. మితృలందరూ తమ వివరాలు అందిస్తే వాటిని క్రోడీకరించి ఒక చోట చేర్చవచ్చు.

జ్యోతి చెప్పారు...

కుమార్ గారు,

మెల్లి మెల్లిగా పరిచయాలు పెరిగితే , అప్పుడు వ్యక్తిగత వివరాలు తెలుసుకోవచ్చు. కబుర్లలో ఐతే గారెలు అస్సలు వండబడవు. మీకు తెలుగు రాయడం,మొదలైన ఎటువంటి సందేహానికైనా నాకు మెయిల్ చేయొచ్చు. లేదా గుంపులో నిస్సంకోచంగా అడగండి.. అందరూ మనవాళ్ళే...
నిన్నటి వివరాలు నా బ్లాగులో చూడండి. అంటే ఇంకా వివరంగా...

Purnima చెప్పారు...

నేనూ.. నా టెంగ్లీషూ.. హమ్మ్!!! ఎంచిమించు మీ కష్టాలే నావీనీ.. కాకపోతే.. మీరు చిత్తసుద్ధిగా ప్రయత్నించారు.. నేను నా పని కాన్నించుకున్నాను!! :-)
మీ నివేదిక బాగుంది.. కానీ అసలు జరిగిన చర్చ.. కూడలిని మెరుగుపరచడం ఎలా, వీవెన్ గారికి మన ఉడతా సాయం ఎలా అందించాలి, కూడలిలో పాత టపాల పునఃప్రత్యక్షం ఎలా మిస్స్ అయ్యారబ్బా!!
ఇక వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకపోవటమే మేలు.. ఇక్కడ బ్లాగులోని టపాలతో చనువు ఏర్పడాలి కానీ.. బ్లాగరితో అవసరం లేదని నా అభిప్రాయం. ఒక్కోసారి వారి "వయస్సు" తెలుసుకున్నాక.. ఆ టపాలు అంతగా నచ్చవు!! ;-)

sujata చెప్పారు...

అయ్యయ్యో ! నాకు తెలియలేదే. నేను మిస్స్ అయ్యాను.

వ్యక్తిగత విషయాల గురించి నాకూ కొన్ని సందేహాలుండేవి. కానీ ప్రమదావనం తో మహిళా బ్లాగర్లంతా వయస్సు తో నిమిత్తం లేకుండా జోకులు వేసుకోవడానికీ, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికీ, (క్లోస్ కావడానికీ) కొన్ని వ్యక్తిగతాలు పనికొచ్చాయి. పెళ్ళయిందా, పిల్లలున్నారా, మనవలున్నారా, పెళ్ళికాలేదా, హాబీలూ, మొక్కలూ, ఉద్యోగాలూ, గొడవలూ, కవితలూ, కావ్యాలూ, పెద్ద పెద్ద ముద్దా లూ (ముద్దా ని తెలుగు లో బహుసా టాపిక్ అంటారేమో!) చర్చించుకోవడం వల్ల, మా పరిధి విస్తృతమైనట్టు అనిపించింది.

అయితే, ఇంత మంది బ్లాగర్లు, అందరు బ్లాగర్లూ చెట్ట పట్టాలేసుకొనేంత గా క్లోస్ కావాలంటే చాలా కష్టమే. అసలే ఈ మధ్య యుద్ధాలు జరిగిపోతున్నాయి బ్లాగు లోకంలో. అందుకే, వ్యక్తిగతాలు మరీ షేర్ చేసుకో కుండా, జాగర్త గా వ్యవహరించాలి.

అమ్మయ్యో, ఈ మంట నక్క, తెలుగు టైపింగ్ చాలా కష్టం చాట్ లో! నాకు అసలే ఏమీ తెలీదు. సరిపోయింది! మేము చాలా మటుకూ టింగ్లీష్ లోనే మాటాడతాము. ఇందులో ట్యూషన్ ఎవరన్న నేర్పితే బావుణ్ణు.

పైగా అంత మంది చాట్ రూం లో అంటే, మీ అందరికీ కష్టం కాలేదా ?

పర్లేదయితే, ఎంజాయ్ చేసేరన్నమాట !

Good Report though (I envy u)!

సందీప్ చెప్పారు...

అన్యాయం. పది రోజులు నెట్టు కి దూరమయ్యే సరికి, ఇన్ని ఘోరాలు జరిగిపోయాయా! తరువాత సమావేశం మాత్రం మిస్సయ్యేది లేదు. ఎప్పుడు ఉంటుందో డేటు చెప్పగలరు.

అశ్విన్ బూదరాజు చెప్పారు...

అయ్యో సరవతీ కుమార్ గారు నేన్ రాలేకపోయాను, నా పేరు అశ్విన్, తెలుగు కోంచం త్వరగా టైప్ చెయ్యలంటే బరాహా వాడచ్చు లింకు
http://www.baraha.com/BarahaIME.htm

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

ఇంకా భారత దేశం చాలా వెనకబడి ఉందండీ :-) వంట చేసుకుంటే బ్రహ్మచారి అని కనిపెట్టేస్తున్నారు...

సుజాత చెప్పారు...

అడ్డెడ్డె! ఎంత పని జరిగిపోయింది? నేను లేకుండానే మీరంతా కబుర్లు చెప్పేసుకున్నారా అయితే? ఊర్నించి వచ్చి నేనేమో నివేదికలు చదవాలా? బాలేదు.

నాకూ టింగ్లీష్ లో మాట్లాడ్డమే అలవాటు! ఎందుకంటే నాకసలు టెక్నికల్ విషయాలు నేర్చుకోవాలంటే భలే బద్ధకం, నేనొక కంప్యూటర్ నిరక్షరాస్యురాలిని! ఏది డౌన్ లోడ్ చేయాలన్నా,ఇన్ స్టాల్ చేయాలన్న నాకు హెల్ప్ కావాల్సిందే! I.E లో బరహ పని చేస్తుందా లేదా? తెలీదు. కానీ టింగ్లీష్ లో టైపు చేయడం మనకు ఈజీయే కాని చదివే వాళ్లకు కష్టం! నేనూ గడ్డిపూలు సుజాత గారి లాగే టింగ్లీషే! ఈ విషయాలన్నీ నేర్చుకోడానికి జ్యోతిగారింటికి వెళ్లాలి చెప్పా పెట్టకుండా!

దిలీప్,
"వంట చేసుకోవాలి (మీకొక్కరికీ)" అంటే బ్రహ్మ చారి! "చేయాలి" అంటే(ఇంట్లో అందరికీ) అంటే పెళ్ళైనట్టు!

సరస్వతీ కుమార్ గారు,
మీ రిపోర్ట్ చాలా బాగుంది. 'అరె, నేను లేకపోయానే ' అని అసూయ పుట్టించేలా ఉంది.

ప్రతాప్ చెప్పారు...

సరస్వతీ కుమార్ గారు,
నెట్ techinical problems, power cuts వల్ల నేను ఎక్కువ సేపు ఉండలేక పోయాను.
మీ రిపోర్ట్, జ్యోతి గారి రిపోర్ట్ బావున్నాయి.
పర్సనల్ విషయాలు అవశరం లేదన్న పూర్ణిమ గారితో నేను ఎకీభవిస్తాను.
దిలీప్ గారు, సుజాత గారు చెప్పింది అక్షరాలా నిజం. :-|)

ప్రతాప్ చెప్పారు...
ఈ పోస్ట్‌ను బ్లాగు రచయిత తొలగించారు.
ప్రతాప్ చెప్పారు...
ఈ పోస్ట్‌ను బ్లాగు రచయిత తొలగించారు.
Saraswathi Kumar చెప్పారు...

@ కొత్తపాళీ గారు,

వ్యక్తిగత వివరాలను తెలియజేయడం మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు.

తెలుగు టైపింగ్ గురించి సూచనలు చేసినందుకు కృతజ్ఞతలు.

@ మురళి,

ఎవరి వివరాలను తెలియజేయటానికైనా బ్లాగ్‌లో ప్రొఫైల్ పేజీ ఉన్నది కదా!మీ ప్రొఫైల్ నేను చూసాను.ఇనీషియేటివ్ గా ఉంటుందని మాత్రమే నేను నా వివరాలను ఇక్కడ ఇచ్చాను.నా కర్టెసీ కొరకు మీరు మీ వివరాలను ఇచ్చారనుకుంటున్నాను.థాంక్యూ వేరీ మచ్!

@ జ్యోతి గారు,

ష్యూర్..!థాంక్యూ!

@ పూర్ణిమ గారు,

ఊరికే ‘రిపోర్ట్ ’ అని శీర్షిక రాసానేగానీ,ఇది జరిగిన విషయం గురించి కబుర్లకు రాని వారికి తెలియజేయుట కొరకు మాత్రమే ఉద్దేశించి రాసినది. సవివరంగా పూర్తి నివేదికను జ్యోతి గారు ఎటూ ఇస్తారు (ఇచ్చారు) కదా!

అయినా కూడా ‘అసలు జరిగిన చర్చ’ అంటూ మీరు పేర్కొన్న అంశాలను కూడా నేను సంక్షిప్తంగా టపాలో పేర్కొన్నాను. కావాలంటే టపా లోని రెండవ పేరా మరోసారి చూడండి. ‘ఫండ్ రైజింగ్’, ‘సాంకేతిక విషయాల గురించి చర్చ’..అవేగా!

‘చనువు’ అంటే ఏకవచనంతో సంబోధించేంత అని కూడా కాదు..కేవలం మనకన్నా చిన్నవారి వరకు ‘గారు’ లేకుండా పిలిచేంత..అని మాత్రమే. అది కూడా వీవెన్ గారు,చదువరి గారు మొదలైన వారికి వర్తించదు.ఎందుకంటే వారి స్థానం అటువంటిది.

ఇక వయసు విషయంలో మీకున్న అభ్యంతరం నాకు లేదు.

@ సుజాత(గడ్డిపూలు)గారు,

మీరు, మానసవీణ సుజాత గారు కూడబలుక్కుని సుజాత(G),సుజాత(M) గా పేర్లు మార్చుకుంటే మాక్కొంచెం సౌకర్యంగా ఉంటుందని మనవి చేస్తున్నాను:-). లేదంటే ప్రతిసారీ మీ మీ ప్రొఫైల్స్ చూడవలసి వస్తున్నది.

ఏమిటి..?!మార్చుకోరా..?!సరే..!ఏంజేస్తాం..ప్రొఫైలే చూస్తాం:-).

@ సందీప్ గారు,

మీరడిగినది టపాలోనే చెప్పబడినది.ప్రతినెలా నాల్గవ ఆదివారం సాయంత్రం 6గం||లకు.

గమనిక:పిలుపుతో,విజ్ఞప్తులతో నిమిత్తం లేదు.

@ దిలీప్ గారు,

ఐతే మీరు సతీవ్రతులన్న మాట!:).

@ సుజాత(మనసులో మాట)గారు,

దిలీప్ గారికి మంచి వివరణ ఇచ్చారు:).

నా రిపోర్ట్ బాగుందా..?!! థాంక్యూ!

@ ప్రతాప్ గారు,

దిలీప్ గారి గురించి నేను చేసిన వ్యాఖ్య సరదాకి చేసినది.ఆయనా సరదాకే తీసుకున్నారు.ఇక పూర్ణిమ గారి అభిప్రాయం అంటారా..ఎవరు ఏమేరకు తమ వివరాలను తెలియజేయాలను కుంటున్నారో తెలియజేస్తూనే ఉన్నారు.

దైవానిక చెప్పారు...

తెలుగులో డైరెక్టుగా వ్రాయాలంటే, బరహా IME వాడండి. మీరు టింగ్లీషులో టైపు చేస్తె, అది తెలుగులో చూపిస్తుంది. ఈ కాపి, పేస్టుల బాధ తప్పుతుంది. మంటనక్క వాడితే తెలుగు extension తో కూడా నేరుగా తెలుగులోనే టైపు చెయ్యొచ్చు.

Saraswathi Kumar చెప్పారు...

అశ్విన్ గారు మరియు దైవానిక గారు, మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు.

సుజాత చెప్పారు...

సరస్వతీ కుమార్ గారు,
అసలే confusionలో ఉన్నారా, ఇంకొంచెం పెంచుతున్నాను. నా బ్లాగు పేరు మానసవీణ కాదు. మనసులో మాట. మానసవీణ బ్లాగు నిషిగంధ గారిది. అందుకే నేను నా పేరు పక్కనే బ్రాకెట్లో మనసులో మాట అని రాస్తున్నాను. మీరు తికమక పడక్కర్లేదు. పైగా గడ్డిపూలు సుజాత గారి పేరు ఇంగ్లీషులో వస్తుంది. నా పేరు తెలుగులో ఉంటుంది. ఇది మరీ బండ గుర్తు. మాటి మాటికీ మా ప్రొఫైల్స్ చూస్తూ ఉంటే ప్రొఫైల్ వ్యూస్ పెరిగి "అబ్బ మనమింత ఫేమస్సా " అని మేము భ్రమ పడిపోతాము మరి.

Saraswathi Kumar చెప్పారు...

మనసులో మాట సుజాత గారూ!

మీరిచ్చిన 'బండ గుర్తు ' తో నా సమస్య తీరిపోయింది.

మీ బ్లాగు మానసవీణ కాదా?!మరి మీరు మీటేది మానస వీణేగా!:).అందుకే నాకు పదే పదే అదే వస్తున్నది.

సుజాత చెప్పారు...

అమ్మో! కత్తి లాంటి డైలాగు కొట్టారు!

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

సుజాత గారు :-) మీ నిర్వచనానికి...

సరస్వతి కుమార్ గారు మీరు కంఫ్యూజ్ అయిపోయారు...

Saraswathi Kumar చెప్పారు...

:)

జ్యోతి చెప్పారు...

కుమార్‍గారు,
ఒకసారి నాకు మెయిల్ చేయగలరా. అర్జెంట్..

jyothivalaboju@gmail.com

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి