శుక్రవారం 29 ఆగస్టు 2008

మీ బ్లాగర్ టెంప్లేట్ మార్చుకోండిలా!!

మనకు బ్లాగర్ Layout లో దొరికే టెంప్లేట్స్ కాకుండా బ్లాగర్ బ్లాగుల కొరకు ఇంకా అనేక రకాల టెంప్లేట్స్ వివిధ వెబ్‌సైట్‌లలో ఉచితంగా దొరుకుతాయి. అవన్నీ Google లో సెర్చ్ చేస్తే తెలుస్తాయి. అయితే గూగుల్ తో పని లేకుండానే www.finalsense.com అనే వెబ్‌సైట్ నా దృష్టికి వచ్చింది. ఆ వెబ్‌సైట్ ద్వారా నేను ఇటీవలే నా బ్లాగు టెంప్లేట్ మార్చుకున్నాను. ఈ విషయమై జ్యోతి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే జ్యోతిగారు ‘మీ బ్లాగు టెంప్లేట్ మార్చకూడదూ!’ అని నాకు సూచించే వరకూ నాకీ ఆలోచనే రాలేదు.

టెంప్లేట్ మార్చడం కొరకు ఏ వెబ్‌సైట్లో ఏ పద్దతి అవలంబిస్తారో తెలియదు గానీ నేను టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్న www.finalsense.com వెబ్‌సైట్ లోని విధానం మాత్రం వివరిస్తాను.

ముందు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి (ఏ విధమైన రిజిస్ట్రేషన్ అవసరం లేదు) Free Blogger Templates అన్న చోట క్లిక్ చేస్తే కుడిపక్కన కొన్ని పాపులర్ టెంప్లేట్స్.. ఎడమ పక్కన ఏయే విభాగాలలో టెంప్లేట్స్ దొరుకుతాయో ఆ విభాగాల పేర్లు ఉంటాయి. నేను Nature అనే విభాగంలో ఉన్న టెంప్లేట్ ఎంచుకున్నాను.

కుడివైపు వరుసలో ఉన్న టెంప్లేట్ బొమ్మ చిన్నగా ఉంటుంది. Sample అనే చోట క్లిక్ చేస్తే పూర్తి రూపం వేరే విండోలో వస్తుంది. దానితో ఆ టెంప్లేట్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అలా కొన్నింటిని చూచి మనకు కావలసిన టెంప్లేట్ ఎన్నుకున్న తరువాత More Details అనే బటన్ నొక్కితే (ఈ బటన్స్ అన్నీ ఆ టెంప్లేట్ పక్కనే ఉంటాయి) టెంప్లేట్ కోడ్.. అలానే దానిని బ్లాగులో పెట్టుకొనే విధానం ప్రత్యక్షమవుతాయి.బ్లాగులో పెట్టుకునే విధానం అక్కడ ఉండే మాట ఎలావున్నా దానిని నేను ఇక్కడ వివరిస్తాను.

ఆ కోడ్‌ను కాపీ చేసి ఆ తరువాత మన బ్లాగర్ Dashboard లోకి లాగిన్ అయి Layout ద్వారా Edit HTML లోకి వెళ్ళి అక్కడ పెద్ద బాక్స్ లో ఉండే కోడ్ (సుమారు ఓ ఐదారు పేజీల సమాచారం)ను డిలీట్ చేసి, ఇంతకు ముందు కాపీ చేసిన కోడ్‌ను అక్కడ పేస్ట్ చేసి, సేవ్ చేయాలి.. అంతే మీ టెంప్లేట్ మారిపోతుంది.

అయితే ఇక్కడ కొన్ని సూచనలు, జాగ్రత్తలు గమనించాలి.

ఒకోసారి లింక్ దొరక్క వెబ్‌సైట్‌లో పేజీలు ఓపెన్ కాకపోవచ్చు, లేదంటే కొత్త టెంప్లేట్ కోడ్ సేవ్ అవకపోవచ్చు. అయినా కంగారు పడాల్సిన పనిలేదు. మరోసారి ట్రై చేయండి.

కొత్త టెంప్లేట్ మారిన తరువాత సైడ్‌బార్‌లో ఉండే Blog Archive, About Me ఫీచర్లు తప్ప మిగతా అన్నింటినీ మరలా పెట్టుకోవలసి ఉంటుంది. హిట్ కౌంటర్, క్లస్టర్ మాప్ వంటివి తొలగింపబడినా వాటి Username, Password (మీరు గనక పాత మెయిళ్ళ వివరాలను తొలగించకపోతే అవి మీ e-mail inbox లో ఉంటాయి చూడండి) ల సహాయంతో వాటి కోడ్‌లను మరలా సాధించి పాత వాటినే మరలా పునరుద్ధరించుకోవచ్చు.

My Blog List, Recent Comments వంటి ఫీచర్లను మాత్రం మరలా పెట్టుకోవలసి వస్తుంది.

అలానే Fonts and Colors (Layout) లోకి వెళ్ళి అక్షరాల పరిమాణం, వాటి రంగు, వాటి బ్యాగ్రౌండ్ రంగు మొదలైనవి మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు.

సో.. ఇంకెందుకాలస్యం!.. అన్నట్టు నా కొత్త టెంప్లేట్ ఎలా ఉంది?

10 వ్యాఖ్యలు:

Purnima చెప్పారు...

bahu baagu!!

cbrao చెప్పారు...

శంఖారావం పేరు background color లో merge అయింది. పేరు contrast రంగులో పెట్టగలరా?

Saraswathi Kumar చెప్పారు...

@పూర్ణిమ గారు, ధన్యవాదాలు!

@రావు గారు, నాకూ అలానే అనిపించింది. సరైన కలర్ నిర్ణయించుకోలేక ప్రస్తుతానికి అలా వదిలేశాను.మీ సూచన మేరకు వెంటనే మారుస్తాను.ధన్యవాదాలు!

సుజాత చెప్పారు...

మంచు కొండల్లోంచి శంఖారావం వినిపిస్తున్నట్టుగా ఉంది! కానీ టెంప్లేట్ మార్చాలంటే అదొక పేద్ద పని లా ఉంటుందండి, భలే బద్ధకం నాకు! అందరూ మారుస్తుంటే చూసి ఆనందిస్తుంటా!

జ్యోతి చెప్పారు...

కుమార్‍గారు, బావుంది మీ బ్లాగు అందం-చందం.కాని టెంప్లేట్ మార్చేముందు పేజ్ ఎలిమెంట్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి.

సుజాత‍గారు, కాస్త ఓపిక కావాలండి మనకు నచ్చిన డిజైన్ దొరికేవరకు. ఆ తర్వాత నిమిషాల పని మార్చడం. మీ బ్లాగు కూడా చాలా పేలవంగా సున్నం కొట్టి వదిలేసినట్టుంది. మార్చండి పండగలోగా.. సందేహాలుంటే నేను చెప్తాగా!

Saraswathi Kumar చెప్పారు...

@ సుజాత గారు,

నేను టెంప్లేట్ సెలెక్షన్ లో ప్రధానంగా అందం కన్నా, అది నా బ్లాగు కాన్సెప్ట్‌కు సరిపోయే విధంగా ఉండాలనుకున్నాను. మీరనుకున్నట్లుగానే దాదాపూ నేనూ అలానే అనుకుని ఈ టెంప్లేట్ ఎంపిక చేసుకున్నాను.

@ జ్యోతి గారు,

పేజ్ ఎలిమెంట్స్ సేవ్ చేయాలని నాకు తెలియలేదు. నేను పైవిధంగానే చేశాను. నేను చేసిన విధానమే టపాలో వివరించాను.

టెంప్లేట్ నచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు!

durgeswara చెప్పారు...

chaalaa baagumdi mI samaachaaram

శరత్ చెప్పారు...

బావుంది మీ సమాచారం - మార్చాలంటే బద్దకం. మీ టెంప్లేట్ నచ్చలేదు - ఏదో ప్రకృతి దృశ్యం తప్ప ప్రత్యేకత కనిపంచలేదు నాకు. సుజాత గారన్నట్లు కొండల్లోంచి శంఖారావం అనుకుంటే తప్ప మీ బ్లాగు పేరు కి తగినట్టుగా లేదు.

Saraswathi Kumar చెప్పారు...

@దుర్గేశ్వర గారు, ధన్యవాదాలు!

@శరత్ గారు, ప్రస్తుతానికి నా బ్లాగు కాన్సెప్ట్‌కు నప్పే టెంప్లేట్ ఇంతకు మించి నా దృష్టికి రాలేదు.అందమైనవి ఎన్నో ఉన్నాయి.కానీ అవన్నీ మనకు సూట్ అవ్వాలి కదా!

Aruna Gosukonda చెప్పారు...

Thank you

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి