కొద్దిరోజుల నుండి ‘కూడలి కా ఖోజ్’ అనే కార్యక్రమం ప్రారంభించి మంచి మంచి బ్లాగులను గుర్తించి నా ‘బ్లాగ్ లిస్ట్’లో చేర్చడం మొదలుపెట్టాను. అది ఇంకా పూర్తవలేదు లెండి. కానీ రాత్రి 'కూడలి కబుర్ల 'లో ‘ఖోజ్’ చెయ్యవలసింది బ్లాగుల కావల చాలా ఉన్నదని తెలిసింది.
కూడలి కబుర్లలో ‘తెలుగు బ్లాగర్ల ఫ్రెషర్స్ డే’ సందర్భంగా కొన్ని నిర్ణయాలు జరిగాయి. తెలుగు బ్లాగర్లలో జూనియర్, సీనియర్ అనేటటువంటి తేడాలేవీ లేవనీ..అంతా సమానమేననీ. ఇక కొత్త బ్లాగర్లకు మార్గదర్శకంగా ఉండటానికి వీలుగా కూడలిలో ఓ పేజీ కేటాయించి దానిలో ‘త.వ.స.’ (తరచుగా వచ్చే సందేహాలు) అంటే ‘వర్డ్ వెరిఫికేషన్’ లాంటి వివరణలు..ఇంకా ఇలాంటి విషయాలు ఉండాలని నిర్ణయించారు. ఇంకా ‘ఫండ్ రైజింగ్’..అలానే మరికొన్ని సాంకేతిక విషయాల మీద చర్చలు జరిగాయి.
ముందుగా ఛలోక్తులు, తరువాత బ్లాగర్ల పరిచయ కార్యక్రమం, తరువాత వివిధ విషయాల మీద చర్చ, ఆ తరువాత సందేహాలు..వాటి నివృత్తి, విజ్ఞప్తులు, వీడ్కోళ్ళు …ఇలా సమావేశం ముగిసింది.
ఇక నెలలో ప్రతి నాల్గవ ఆదివారం సాయంత్రం 6గం||కు పిలుపుతో పని లేకుండా కూడలి కబుర్లకు రావాలనీ.. రావచ్చనీ తెలియజేయబడింది.
పరిచయ కార్యక్రమం కొంత ఎక్కువ టైం తీసుకునేసరికి చివరి వరకూ అందరూ ఉండలేకపోయారు. రాత్రి జరిగినది ‘ఫ్రెషర్స్ డే’ అనే కాన్సెప్ట్ తో గనుక పరిచయ కార్యక్రమం తప్పదు. ఇక నుండి జరిగే వాటిలో ‘అందరూ ఒకరికొకరు సుపరిచితులే’అనే ప్రాతిపదికతో (కొత్త వారు తమ తమ బ్లాగుల ద్వారా పరిచయమవుతూనే ఉంటారు కదా!) ఛలోక్తులు (ఇవి ఏటూ తప్పవు) అయిన వెంటనే చర్చ ప్రారంభిస్తే అందరూ ఒకేసారి డిస్పర్స్ అవ్వచ్చు.
దిలీప్ గారి నిష్క్రమణ బావుంది.’నే వెళ్తున్నా..!వంట చేసుకోవాలి’. సో ఆయన బ్రహ్మచారి అన్న మాట.
ఒరెమూనా గారు ‘తెలుగు తెలుగు’ అని ఎవరినో హెచ్చరించారు.కానీ పూర్ణిమ గారు టింగ్లింష్‌లోనే కబుర్లాడారు. ఆ టింగ్లింష్ చాలా బావుంది.
‘muralee !Edi nijaM?’
naatO Emainaa samasyalunnaayaa?
సాలభంజికలు గారి అధ్యక్షత బావుంది. రానారె గారు రాగానే సాలభంజికలు గారు తన బాధ్యతను ఆయన కప్పగించి నిష్క్రమించారు.(తరువాత మరలా వచ్చారులేండి)
రానారే గారు రాగానే ఒరెమూనా గారు ‘రెడ్డి’ గారూ స్వాగతం అన్నారు. జ్యోతిగారు ‘రాము’ గారూ స్వాగతం అన్నారు. మిగతా ‘నారాయణ’ను నేనూహించుకున్నాను.
{కబుర్ల మధ్యలో బ్లాగింగ్ ఓ వ్యసనం అనే కోణంలో కొందరు సీనియర్ బ్లాగర్ల నుండి (సారీ..!సీనియర్,జూనియర్ అనకూడదు కదూ!)వ్యాఖ్యలు వచ్చాయి. దానితో నా మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ అంశాన్ని జ్యోతి గారితో ప్రస్తావిస్తే అది మన చేతిలోనే ఉందన్నారు. ఈ విషయం మీద నేనో టపా రాస్తాను}
గుడ్‌నైట్ చెప్పేటపుడు మీనాక్షి గారిని, మురళీధర్ గారినీ నేను సంబోధించలేక పోయాను. నేను ‘లేఖిని’ తో కుస్తీ పడుతూ కాపీపేస్ట్‌లు చేస్తున్నాను. దానికి తోడు ‘మంటనక్క’ ఒకటి లేకపోవడం. దానితో ఆలస్యమైపోతూ ఉన్నది. ‘అక్షరమాలలో రాయండి!’ అని ఉన్నది. దానితో ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకోవాలి. అందరూ స్పీడ్‌గా కబుర్లు చెప్పడానికి అక్షరమాలే కారణమనుకుంటా!
జ్యోతిగారు ‘మంటనక్క’ అన్నారు. ప్రతాప్ గారు, ప్రదీప్ గారు ‘ఫైర్ ఫాక్స్’ అన్నారు. అదే ఇదని తట్టేసరికి తెల్లారింది.
జ్యోతిగారు ‘జ్యోతక్క’ ఎందుకైనారో నాకు రాత్రే తెలిసింది.
మురళీధర్ గారు పరిచయకార్యక్రమంలో అందరి వ్యక్తిగత వివరాలు చెబితే బాగుండేది అన్నారు. పూర్ణిమ గారు వాటిని తెలుసుకుని ఎంజేస్తామన్నారు. దానికి సమాధానంగా మురళీధర్ గారు తోటి బ్లాగర్ల గురించి తెలుసుకుంటే అదో ‘తుత్తి’ అన్నారు.
ఇద్దరి అభిప్రాయాలూ నిజమే. అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు..ఇవి అనవసరం. కానీ వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, చేసే పని, ప్రస్తుత నివాసం..ఇత్యాదివి తెలిస్తే మురళీ గారు అన్నట్లు అదో ‘తుత్తే’ కదా! కనీసం వయసన్నా తెలిస్తే ఈ ‘గారె’ల (గారు) బాధ కొంతైనా తగ్గి కాస్త చనువైనా ఏర్పడుతుంది. అందుకే నా వివరాలు చెబుతున్నాను.
నన్ను సాలభంజికలు గారు సరస్వతీ పుత్రులు అన్నారు.ఆయన అర్థంలో నేను లక్ష్మీ పుత్రుడిని కూడా.ఎందుకంటే నా పూర్తి పేరు లక్ష్మీ సరస్వతీ కుమార్.
నేను పుట్టిన సంవత్సరం 1970.
నేను పుట్టి పెరిగినది,చదువుకున్నది గుంటూరు జిల్లా బాపట్లలో.
ప్రస్తుత నివాసం వైజాగ్.అచ్చ తెలుగులో విశాఖపట్నం.
అంత్యనిష్ఠూరమా ? ఆది నిష్ఠూరమా ?
10 గంటల క్రితం
+of+lakshmi%5B1%5D.jpg)
