20, ఏప్రిల్ 2020, సోమవారం

యోగ భావనలు (Concepts of Yoga) - 7




SUCCESS CHAIN

WHERE IT STARTS AND WHERE IT ENDS



విజయం ఒక గొలుసు లోని చివర అనుకుంటే దాని మొదలు ఏది ? మద్య భాగాలు ఏవి?

అంటే ఏ చర్యా క్రమం అంతిమంగా విజయానికి దారితీస్తుంది?

ఆ క్రమం ఎక్కడ మొదలవుతుంది ? 

ఏ చర్యతో మొదలవుతుంది?

మరలా ఏ ఏ చర్యలగుండా ప్రయాణిస్తుంది?

ఆ క్రమం యొక్క స్వరూపం ఏవిధంగా ఉంటుంది?

ఏం చేస్తే విజయం లభిస్తుంది అనే ప్రశ్నకు సహజంగా అందరూ చెప్పే సమాధానం కష్టపడితే విజయం వరిస్తుంది అనే!

మరి కష్టపడినవారందరికీ విజయం లభిస్తుందా అంటే… లేదనేదే జవాబు!

మరి అలాగని కష్టపడకపోతే వస్తుందా అంటే….. అప్పుడూ కాదన్నదే సమాధానం!

మరి సరైన సమాధానం ఏమిటి అంటే కష్టపడినవారిలో కొందరికి విజయం లభిస్తుంది. 

అంటే కష్టపడినా కూడా కొందరికి విజయం లభించదనే కదా అర్థం.

అంటే కష్టపడటం అనేది విజయానికి మూలకారణమైతే కాదు

విజయాన్ని అందుకునే క్రమంలో కష్టపడటం, తద్వారా విజయం పొందటం అనేవేకాక ఇంకా ఏవో ఉన్నాయి. 

అంటే ఇవి రెండు కన్నా ఎక్కువ. 

ఈ క్రమంలో కష్టపడటం కన్నా ముందు వచ్చేది ఏమిటి. 

కష్టపడేవారిలో విజయానికి తగిన పొటెన్షియాలిటీ ఉన్నవారు మాత్రమే విజయాన్ని పొందుతారు. 

అంటే కష్టపడటం ఒక్కటే సరిపోదు.  తగిన పొటెన్షియాలిటీని or పొటెన్షియల్ రిజర్వ్ ని కలిగి ఉండాలి. 

అంటే success chain లో మూడో అంశం వచ్చింది. అదే కష్టపడటానికన్నా ముందే తగిన potential resreve ను కలిగి ఉండటం.  

మరి ఎవరైనా కష్టపడితే విజయం సిద్ధిస్తుంది అని మాత్రమే చెబుతారెందుకు.

ఈ పొటెన్షియాలిటి గురించి చెప్పరెందుకు.

ఎందుకంటే success chain లో కష్టపడటం, తద్వారా విజయాన్ని పొందటం అనేది మాత్రమే visible part. అతకన్న ముందు ఉండేదంతా invisible part.

ఆ కనపడని భాగాన్ని దర్శించలేనివారు దాని గురించి ఏమి చెప్పగలరు. 

అప్పటికీ కొందరు వేదాంత ధోరణిలో అదృష్టం, తలరాత, ప్రారబ్దం, గతజన్మ కర్మఫలం లాంటి వాదనలు చేస్తారు కానీ అవి అంత స్పష్టంగా, శాస్త్రీయంగా ఉండవు. 

ఆ వాదనలన్నీ ఈ ఆధునిక ప్రపంచంలో మూఢనమ్మకాలుగా కొట్టివేయబడతాయి.  

ఇక మిగతా చర్చను కొన్ని ప్రశ్నోత్తరాల రూపంలో కొనసాగిద్దాం

ఈ potential reserve వల్ల విజయం ఎలా వస్తుంది?

ఇది విజయపు పూర్వరూపం. ఈ reserve ప్రయత్నం లేక కష్టపడటం అనే మాధ్యమం ద్వారా విజయంగా రూపాంతరం (transformation) చెందుతుంది.

ఐతే ఈ potential reserve ఎక్కడనుండి వస్తుంది. ఎలా వస్తుంది?

ఇది కాలక్రమంలో నెమ్మదిగా పోగుబడుతుంది (accumulate). క్రమంగా పెరుగుతుంది. నిర్ణీత పరిమాణానికి చేరుకోగానే రూపాంతరీకరణకు (transformation) సిద్ధమవుతుంది.

ఇది ఇలా పోగుబడటాన్ని నిర్దేశించే అంశమేది?

మనం మంచి పనులు, మంచి ఆలోచనలు చేసినపుడు positive reserve పోగుబడుతుంది

చెడు పనులు, చెడు ఆలోచనలు చేసినపుడు negative reserve పోగుబడుతుంది

positive reserve, negative reserve లలో ఏది ముందుగా  నిర్ణీత పరిమాణానికి చేరుకుంటుందో అది ముందుగా రూపాంతరీకరణ చెందుతుంది.

positive reserve ఐతే విజయంగా మారుతుంది. negative reserve ఐతే పతనంగా మారుతుంది.

positive reserve సాధ్యమైనంత ఎక్కువగా పోగుబడేటట్లుగా ఎల్లప్పుడూ మంచి పనులు, మంచి ఆలోచనలు చేయడం; negative reserve సాధ్యమైనంత తక్కువగా పోగుబడేటట్లుగా అన్నివేళలా చెడు పనులు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించడం.... ఇదే సాధన!

మంచి చెడుల నిర్వచనమేది?

మంచి చెడుల గురించి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటిని అనుసరిస్తే potential accumulation జరుగుతుందని చెప్పలేము. ఎక్కువ మంది మంచి చెడులను ధర్మాధర్మాల దృక్కోణంలో చూస్తారు. కానీ ఈ సాధనలో అలా కాక మంచి చెడులను బలం బలహీనతల దృక్కోణంలో చూడాలి. అది ఎలా అనేది ప్రత్యేక చర్చ.

ఈ మొత్తం చర్చ అనంతరం success chainను మనం ఈవిధంగా చెప్పవచ్చు. 

బలం బలహీనతల దృక్కోణంలో మంచి పనులను, మంచి ఆలోచనలను చేయడం, తద్వారా కాలక్రమంలో Positive potential ను accumulate చేసుకోవడం, అది నిర్ణీత పరిమాణానికి చేరుకున్న తరువాత దానిని ప్రయత్నపూర్వకంగా విజయంగా మార్చుకోవడం. ఇదీ క్రమం.