‘సత్యాన్ని ఏదో బ్రహ్మపదార్ధం చేయకూడదు. అది చట్రాల్లో ఒదగదు.. సూత్రీకరణలకు లొంగదు.’ అని అన్నారు.
సత్యం బ్రహ్మపదార్ధం కాదనేదే నా అభిప్రాయం కూడా. ‘అది చట్రాల్లో ఒదగదు, సూత్రీకరణలకు లొంగదు’ అని మీరే దానిని బ్రహ్మ పదార్ధం చేస్తున్నారు. ‘గతితార్కిక పద్దతి ద్వారా సత్యాన్ని చేరవచ్చు’ అని పాశ్చాత్యులు నిర్ధారిస్తే, ‘గుణాతీత స్థితి ద్వారా సత్యాన్ని ఆవిష్కరించవచ్చు’ అని భారతీయులు పేర్కొన్నారు. సత్యం చట్రాల్లో ఒదగదు, సూత్రీకరణలకు లొంగదు అని మీరు ఏ ప్రాతిపదికతో పేర్కొనగలిగారో తెలియడంలేదు. అసలు తత్త్వశాస్త్రం యొక్క ఉద్దేశ్యమే సత్యాన్ని సూత్రీకరించడం, దాన్నెలా చేరాలో చెప్పడం.
‘ఏమిటిదంతా?’ అని అన్నారు
ఇదంతా ‘తాత్త్విక చర్చ’.. చాలా అవసరమైనది. ఈ విషయాన్ని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.
‘మీమాంసలో కొట్టుకుపోతే జీవితాన్ని దర్శించలేము’ అని అన్నారు.
‘మీమాంస’ అంటే సందేహాస్పద స్థితి..డోలాయమానం..డైలమా. నేను ఏదైతే చెప్పానో అదంతా రూఢిగానే చెప్పాను. ఎక్కడా సందేహాలను గానీ, ఊగిసలాట ధోరణిని గానీ వెలిబుచ్చలేదు. మరి ఇదంతా మీకు మీమాంసగా ఎలా అనిపించింది?
‘రచనలో సరళతలేదు.. హెచ్చు స్థాయిలో ఉన్నది.’ అన్నారు.
ఈ మాట మాత్రం నిజం. అయితే ఇందులో నా పాండిత్య ప్రదర్శన ఏమీలేదు. తత్త్వశాస్త్రంలో సంక్లిష్టత, పైస్థాయి అనేవి అనివార్యం. తత్త్వశాస్త్రం అనేదే తలపగిలే సబ్జెక్ట్. జనబాహుళ్యాన్ని ఆకట్టుకోలేనిది. చాలాకొద్దిమందికి మాత్రమే ఆసక్తి ఉండే విషయం. అప్పటికీ నేను సబ్జెక్టును సాధ్యమైనంతవరకూ సరళం చేయడానికే ప్రయత్నించాను.
(తత్త్వశాస్త్రంలో నాకున్న కొద్దిపాటి ప్రవేశం, కొద్దిపాటి అభిరుచి మేరకు నేను రాసిన ఈ వ్యాసాలే మీకు సరళంగాలేవని అనిపించాయంటే ఇక ప్రసిద్ధ తత్త్వవేత్తల రచనలు ఎలా ఉంటాయో ఆలోచించండి!)
ఈ రచనలో నా ప్రధాన ఉద్దేశం జనబాహుళ్యానికి అర్ధంకావాలనేదానికన్నా..
..ముందుగా ఇప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు పునాదిగా ఉన్న తాత్త్విక భావాలకు మారుగా భారతీయ తాత్త్విక భావాలను పరిచయం చేయడం, వాటిని మన సమస్యల పరిష్కారానికి అనుగుణమైన రూపంలో, ఒక క్రమపద్ధతిలో, సాధ్యమైనంత సంగ్రహంగా క్రోడీకరించడం..
..అలా క్రోడీకరించిన తాత్త్విక భావనలే పునాదిగా నూతన రాజకీయ, సామాజిక వ్యవస్థను ప్రతిపాదించే ఒక నూతన సిద్ధాంతాన్ని రూపొందించడం. అందుకనుగుణమైన నూతన భావజాలాన్ని నిర్మించడం.
ముందుగా భారతీయ తత్త్వశాస్త్రంలోని కొన్ని మౌలికభావనలను ప్రాధమిక స్థాయిలో సంగ్రహంగా ఒక నూతన దృక్కోణంలో (new interpretation) పరిచయంచేసే ఈ తాత్త్విక రచన విజయవంతంగా పూర్తయితే దానిని ఆధారంగా చేసుకుని ప్రజలందరికీ అర్ధమయ్యేటట్లుగా, వారిని ఆకట్టుకునేటట్లుగా విపులమైన , వివరణాత్మకమైన, విస్తారమైన రచనలు చేయవచ్చు.
‘ఇదంతా స్పెక్యులేషన్ లాగా అనిపిస్తున్నది’
ఈ మాట మీద నేను స్పందించదలచుకోలేదు.
‘నేరుగా విషయాన్ని చెప్పండి.. వింటాను.’
మొదటి అధ్యాయంతో మీకేమీ సమస్య లేదని అనుకుంటున్నాను. రెండవ అధ్యాయం లోని విషయం మాత్రం కొంచెం కన్‌ఫ్యూజన్ కు దారితీసే అవకాశం ఉంది. చెప్పుకున్నాం కదా!..సబ్జెక్ట్ అటువంటిది. పైగా కొత్త భావాలు.
(భారతీయ తాత్త్విక విషయాలకు కొన్ని వందల సంవత్సరాలుగా అనేకమంది పండితులు అనేక రకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే నేను ఈ రచనలో ఎంపిక చేసుకున్నది కొద్ది భావాలే అయినప్పటికీ ఆయా పండితుల భాష్యాలన్నింటికీ భిన్నంగా, సరికొత్తగా, నేటి మన అవసరాలకు అనుగుణంగా భాష్యం (interpretation) రాశాను.)
ఆ తాత్త్విక వ్యాసాల (గీతా వ్యాసాలు)లో ‘కర్మ స్వరూపం’ అనే శీర్షిక క్రింద రాసిన విషయాన్నంతా వీలైతే మరోసారి చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ విషయం అర్థమైతే వ్యాసావళిలోని మిగతా విషయాలన్నీ చాలా సులువుగా అర్థమౌతాయి. అప్పుడు నేను చెప్పినదంతా మీకు నేరుగానే అనిపిస్తుంది.
ఇక చివరిగా.. నేను రాసిన ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసం బావుందన్నారు. ధన్యవాదాలు! నేను రాస్తున్న వ్యాసావళినంతా ఓ చిన్న పేజీలోకి ఓ చిరు వ్యాసంగా సంగ్రహిస్తే అది ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసమౌతుంది. అంతే తప్ప ఈ రెంటికీ ఏమీ తేడా లేదు. ఆ వ్యాసం నచ్చితే ఈ వ్యాసావళంతా నచ్చినట్లే. నా ఆలోచనా సారాన్నంతటినీ ఒక్క ముక్కలో చెప్పమంటే నేను లిటరల్‌గా ఒక్కముక్కలో చెప్పలేనుగానీ ‘సత్యాన్వేషణ పథం’ వ్యాసాన్ని మాత్రం సూచిస్తాను.
సీతారాం గారూ! మీరు ఈ రచన యెడల వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటికీ సమాధానాలు ఇవ్వగలిగాననుకుంటున్నాను.
ఈ రచనకు లక్షిత పాఠకులైన అతికొద్దిమందిలో ఒకరైన మీకు మరోసారి కృతజ్ఞతలు! ఈ రోజు భగవద్గీత ఆవిర్భవించిన రోజు. మీకూ మరియు మిగతా బ్లాగ్మితృలందరికీ 'గీతా జయంతి ' శుభాకాంక్షలు!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి