6, ఫిబ్రవరి 2008, బుధవారం

చలం-ఒక సమీక్ష (రెండవ భాగం)

ఎంతో జీవితం ఉండగానే, నడివయసులోనే చలం జీవితం చెల్లాచెదురైనది. భార్య చలం ప్రవర్తనతో విసిగి వేసారి, చదువుసంధ్యలు, పెళ్ళిళ్ళు లేని తన పిల్లల దుస్థితికి తీవ్రంగా దుఃఖించి, మతిస్థిమితం తప్పి, గుండెపగిలి చనిపోయింది. పెద్దకొడుకు చిన్నవసులోనే రోగగ్రస్థుడై మరణించాడు. రెండవకొడుకు దురలవాట్లకు బానిసై ఇల్లు వదలి శాశ్వతంగా ఎటో వెళ్ళిపోయాడు. పెద్దకూతురు సన్యాసినిగా మారింది. మరో కూతురు చిన్మయానందుని శిష్యురాలైనది. మరో కూతురు బొంబాయిలో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళిపోయింది.

చలం ఏకుటుంబ జీవితాన్ని విమర్శించాడో ఆకుటుంబమే, స్వయంగా తన కుటుంబమే సమాజం ముందు ఈవిధంగా నిలబడింది. తన కుటుంబాన్ని ఆర్ధికంగా అప్పటివరకు ఆదుకున్న వదిన డాక్టర్ రంగనాయకమ్మ మరణించింది. ప్రియురాలు లీల వీడి వెళ్ళిపోయింది. బంధువులు, కులం, సమాజం ఏనాడో చలాన్ని బహిష్కరించారు. ఐనా చలం తన అభిప్రాయాలను వీడలేదు. చలం ఉద్యోగరీత్యా ఏ ఊరు వెళ్ళినా ఊరిచివరో, దాపులనున్న ఏ అడవిలోనో ఉన్న పాడుబడ్డ ఇళ్ళలోనో, లేదా హైందవేతరులు నివసించే వీధులలోనో మాత్రమే అతనికి ఇల్లు అద్దెకు దొరికేది. హిందూ సమజం అంతగా అతన్ని వెలివేసింది. చలం ఈ పరిణామాలవలన క్రమంగా మానసికంగా బలహీనపడ్డాడు. తన కుటుంబసభ్యులు అరుణాచలం(తమిళనాడు) లోని రమణ మహర్షి శిష్యులుగా మారి అచటికే వెళ్ళటంతో చలం వేరేదారిలేక బెజవాడలోని తన ఆస్తులనన్నింటినీ తెగనమ్ముకుని తానుకూడా అరుణాచలానికి వెళ్ళిపొయాడు.

ఆంధ్రదేశంలో ఆదరణకరవై, జీవితం చిన్నాభిన్నమై అరుణాచలం వెళ్ళిన చలం రమణ మహర్షి చల్లని చూపులతో సాంత్వన పొందుదామనుకున్నాడు. ఐతే ఆంధ్రదేశంతోపాటు విధి కూడా చలాన్ని చిన్నచూపు చూసింది. ఈయన వెళ్ళిన అతికొద్ది కాలానికే రమణ మహర్షి ఇహలోక యాత్రను చాలించారు. అప్పటినుండి చలం ఎమోషనల్ గా తన పెద్దకూతురు, యోగిని, రమణ మహర్షి శిష్యురాలూ అయిన సౌరిస్ మీద ఆధారపడటం జరిగింది.

ఈవిధంగా మానసికంగా దుర్బలుడైన చలం ఈశ్వరవాణి అనీ, అష్టగ్రహ కూటమి అనీ ఆంధ్రదేశంలోని తన స్నేహితులకు ఉత్తరాలు రాసి నవ్వులపాలయ్యాడు. ఐతే చలాన్ని మనం విమర్శించకూడదు. ఎందుకంటే ఆయన తన సర్వశక్తులనూ తను నమ్మిన అభిప్రాయాలకొరకు ధారపోశాడు. తన మానసికశక్తినంతటినీ ధారపోసి ఎన్నో రచనలు చేశాడు. తనను, తన కుటుంబాన్ని బలి ఇచ్చాడు. సంఘబహిష్కరణను తిరుగులేకుండా ఎదుర్కొన్నాడు. ఇది చలం ప్రజల కుటుంబ జీవితంలో ఇసుమంత మార్పు కొరకు చేసిన త్యాగం, బలిదానం. దానిని మనం గుర్తించాలి.

చలం ప్రధానంగా లోపాన్ని ఎత్తి చూపాడు. దోషాన్ని విమర్శించాడు. వాటిని ప్రజలకు చాటి చెప్పాడు. తన మేధస్సునంతా, తన ప్రతిభనంతా దోషాన్ని ఎత్తిచూపటంలోనే చూపాడు. ఐతే ఏ సంస్కరణవాదైనా,ఏ తాత్వికుడైనా దోషం ఎత్తిచూపటంతోటే ఆగడు. పరిష్కారంగా కూడా కొన్ని అభిప్రాయాలను చెబుతాడు. అక్కడ అతనికి పట్టు ఉండక పొవచ్చు. ఆకోణంలో అతను ఎక్కువగా ఫోకస్ చేయక పోవచ్చు. ఐనా కూడా దోషాన్ని చెప్పినపుడు పరిష్కారం చెప్పటం అనేది సహజంగానే జరిగిపోతుంది. ఆయనను విమర్శించేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.....(సశేషం)

4 కామెంట్‌లు:

  1. చాల బాగా వ్రాసారండి..
    ఒక రకం గా ఆ రోజోల్లో స్టాండర్డ్స్ బట్టి చూస్తె వాలా కుటుంబం కూడా మరీ అందరూ చెప్పే అంత హీనం గా ఏమీ కాలేదు.
    జబ్బులు, అకాల మరణాలు ఆ రోజుల్లో మామూలే. మనం మన పెద్ద వాళ్ళని అడిగితె (మన తాట గారి తండ్రుల కాలం అది) తెలుస్తూంది ఎంతమంది ఎలా జబ్బున పడ్డారో ఆకాలం గా చని పొయ్యే వారో. రవి చనిపోవటం ఏంటో సహజ మైన మరణం.
    ఎంతమంది బాల వితన్తువలు లేరు ఆ రోజుల్లో మోడుగా.. శౌ గారు తర్వాతి కాలం లో గొప్ప పేరు సంపాదించారు యోగినిగా..
    బతికిన అన్ని నాళ్ళు చలం పిల్లలు ప్రేమతో సంతోషంగా బతికారు..
    మన ద్రుష్టి తో వాళ్ళని చూస్తె వాళ్లకు గొప్ప ఆస్తులు లేక పోవచ్చు .. ఏనాడూ కొంత మందికి పెట్టారు గానీ అడుక్కు తిన లేదు.

    రిప్లయితొలగించండి
  2. హైమ గారూ! ధన్యవాదాలు! మీరిచ్చిన లింక్ లో మీ బ్లాగు చూశాను. చలం కొటేషన్స్ బావున్నాయి. వాటికి కొంత మీ వివరణ కూడా జోడిస్తే బావుండేది.

    చలం మూఢంగా జీవించేవారిని హేళన్ (వ్యంగ్యం) చేసేటపుడు ఉపయోగించే మాటలు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి. అటువంటివి కూడా మీ బ్లాగులో రాయగలరేమో ఆలోచించండి.

    నేను ఈ వ్యాసాలను 'వాడ్రేవు వీరలక్ష్మి ' గారి 'సత్యాన్వేషి చలం' పుస్తకం ( ఈ పుస్తక పరిచయం నా 'వేణుగానం' బ్లాగులో రాశాను) చదివిన ఉద్వేగంలో రాసినవి. బ్లాగులో రాసిన తరువాత వాటికి ఇంతవరకూ ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఎవరో ఒక చలం అభిమాని దృష్టిలో ఈ వ్యాసాలు పడక పోవు, వారు కామెంట్ చేయక పోరు, అని ఇన్నాళ్ళూ అనుకున్నాను. చివరికి మీరు చదివి కామెంట్ చేసారు. మీకు మరోసారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. kumar garu,,,
    kshaminchali ilaa antundanuku..hyma garu cheppinattu chalm garu manasikamga durbhalulai arunachalm vellipoledu,,,,manasikam ga edigi satyanweshana kai akkadiki vellipoyaru...anthe gani ee kulli samjam tanani tarimesindadni ikkada nunchi bhayapadi paripoledu,,....of course,andaruu gadipe sadharana jeevithanni valla kutumbam gadapaleka poyindi,,,,w.r.t samajam tho polchi chuste ,ee chakram lo chikkukuni vunna vallaki adi chalam failure gane anipistundi

    రిప్లయితొలగించండి
  4. Hi sarswathi,

    I think, the mentioned points are wrong. chalam manasikam ga kungi poyi arunachalam vellaledu. That is his wish. His wife suffered alot, i agree but she died peacefully in arunachalam. Koduku duralavatlaku lonu kaledu...edo kopam lo chalam oka mata anesariki aligi vellipoyadu. more over chalam never restricted his children.
    I can say lot of things like this...i think u better to read souris jeevitham part1 and part2 to better understanding of chalam life and his childrens life.

    రిప్లయితొలగించండి