5, జులై 2019, శుక్రవారం

యోగభావనలు (Concepts of Yoga)పని - ఫలితం


మనం చేసే పనులకు రెండురకాలైన ఫలితాలు లభిస్తాయి. 

మొదటిది మనకు ప్రత్యక్షంగా కనిపించే ఫలితం. ఇది తక్షణం కార్యరూపం దాల్చుతుంది. అందరూ ఇది మాత్రమే ఫలితం అనుకుంటారు.

కానీ మరోరకమైన ఫలితం కూడా ఉంటుంది అది పైకి కనిపించదు. వెంటనే కార్యరూపం దాల్చదు.

మొదటిది Active and Visible Result

రెండవది Potential and Invisible Result

పైకి కనిపించని Potential Result మరలా రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి Positive Potential మరోటి Negative Potential 

ఇవి రెండూ వేరువేరు Reserves గా ఉంటాయి. అంటే వేటికవే ప్రత్యేకమైన నిల్వలుగా ఉంటాయి.

మనం నిరంతరం చేసే పనులకు తక్షణ ఫలితం ఎలా ఉన్నా వాటిలోని మంచి చెడులవలన ఈ రెండు రకాల Potential Results ఏర్పడతాయి. 

మనం చేసే పనిలోని మంచి Positive Potential రూపంలో Positive Reserve గా ఏర్పడుతుంది. ఆ తదుపరి చేసే పనులలోని మంచి కూడా Positive Potential గా మారి క్రమానుగతంగా దీనికి add అవుతుంది.  

అలాగే మనం చేసేపనులలో చెడు ఏమైనా ఉంటే అది Negative Potential రూపంలో Negative Reserve గా ఏర్పడుతుంది. ఆ తదుపరి చేసే పనులలోని చెడు కూడా Negative Potential గా మారి క్రమానుగతంగా దీనికి add అవుతుంది. 

కొంతకాలం ఇలా పెరుగుతూ పోయి ఆ Reserves నిర్దిష్ఠ పరిమాణానికి (Certain Quantity) చేరుకున్న తరువాత Potential & Invisible Form దశ నుండి Kinetic & Visible Form దశలోకి మారతాయి. అయితే ఇవి రెండూ ఒకే సారి మారవు. ఎందుకంటే ఇవి రెండూ ఒకే స్థాయిలో పెరగవు. ముందుగా Ripen Stateకు చేరుకున్నది ముందు మారుతుంది.

Positive Reserve and Negative Reserve ఈ రెంటిలో ఏది ముందుగా నిర్ధిష్ఠ పరిమాణానికి చేరితే అదే ముందుగా వ్యక్తీకరింపబడుతుంది.

ఏ వ్యక్తిలోనూ సాధారణంగా మంచి చెడులు సమానంగా ఉండవు. ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుది కనుక అదే ముందుగా వ్యక్తీకరణ దశకు చేరుతుంది.

తక్షణం లభించే మొదటి రకం ఫలితం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. కానీ దీర్ఘ కాలంలో పోగుపడిన Potential Reserve వ్యక్తీకరింపబడటం వలన కలిగే రెండవ రకం ఫలితం  దీర్ఘకాలం ఉంటుంది.

ఘనకార్యాలు ఎప్పుడూ Positive Potential వ్యక్తీకరింపబడటం వలన మాత్రమే సాధింపబడతాయి. కానీ అనేకమంది ఘనకార్యాలను ఎలాంటి Positive Reserveనూ కలిగిలేకుండా మొదటి రకమైన తక్షణ ఫలితం రూపంలో సాధించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటారు.

అలాగే దుస్థితి కూడా ఎవరికైనా Negative Potential వ్యక్తీకరింపబడటం వలన మాత్రమే సంభవిస్తుంది.

పైన తెలిపిన విషయాలను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం

సమానమైన అర్హతలు, సమానమైన అవకాశాలను కలిగిన ఇరువురు వ్యక్తులు జీవితంలో వృద్ధిలోకి రావాలని తలపోసి ఒకే చోట ఒకే రకమైన వ్యాపారాన్ని ప్రారంభించారనుకుందాం. వ్యాపారవిజయానికి ఇరువురూ చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నారు, ఇరువురూ సమానంగా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారు పొందే ఫలితాలెలా ఉంటాయో చూద్దాం.

వారిరువురూ తగిన పరిమాణంలో Positive Reserveను కలిగి ఉంటే ఇరువురూ విజయాన్ని పొందుతారు.

ఒకరు మాత్రమే కలిగి ఉంటే ఆ ఒకరు మాత్రమే విజయాన్ని పొందుతారు.

ఇరువురూ కలిగి లేకపోతే ఇరువురూ అపజయాన్ని మాత్రమే పొందుతారు.

ఏవరికి ఏస్థాయి Reserve ఉంటే వారు ఆ స్థాయి విజయాన్ని మాత్రమే పొందుతారు.

ఇక్కడ ప్రయత్నం అనేది నిమిత్తమాత్రమైనటువంటిది. కేవలం ప్రయత్నించినంతమాత్రాన ఇలాంటి విషయాలలో ఎవరూ విజయాన్ని పొందలేరు. అది చిత్తశుద్దితో కూడుకున్న ప్రయత్నమైనప్పటికీ.   

ఇలా ప్రయత్నిస్తున్న వారికి Positive Reserve లేకపోగా Ngative Resrve గనుక ఉంటే వారు ఆస్తులు కోల్పోయి అప్పులపాలై కష్టాల సుడిగుండం లోకి నెట్టివేయబడతారు.

కనుక కేవలం ప్రయత్నాన్ని నమ్ముకుని కార్యరంగంలోకి దూకితే ఫలితం దక్కుతుందనుకోవడం మూర్ఖత్వం. క్రమశిక్షణాయుతమైన గతజీవితం సుదీర్ఘంగా వున్నవారు మాత్రమే Positive Reserve ను కలిగిఉంటారు. వారు మాత్రమే తమప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు. 

వ్యాపారమే కాకుండా విద్య, ఉద్యోగం, రాజకీయం, క్రీడారంగం, గ్లామర్ రంగం ఇలా దేనికైనా ఈ సూత్రం వర్తిస్తుంది.1 వ్యాఖ్య:

  1. పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్ https://telugureads.com/vijnanam-telugureads-knowledge-book-reading/

    ప్రత్యుత్తరంతొలగించు