4, జులై 2020, శనివారం

యోగ భావనలు (Concepts of Yoga) - 8






VISIBLE SUCCESS – INVISIBLE SUCCESS




visible success is conditional 


లోకానికి ప్రకటించే విధంగా లేక ఇతరులు గుర్తించే విధంగా ఉన్న విజయాన్ని visible success అనవచ్చు. ఇలాంటి విజయం కోసం ఈ లోకంలో అనేక మంది అర్రులు చాస్తుంటారు. మరి దీనిని ఎలా సాధించాలి. 

దీనికోసం ప్రయత్నం చేసినంత మాత్రాన ఇది లభించదు. ఇది అనేక షరతుల మధ్యన మనకు దొరుకుతుంది.

ఆ షరతులేవంటే

మనలో Potentiality ఉండాలి. 

ఉండగానే సరిగాదు,………. అది తగినంత పరిమాణంలో (తగినంత స్థాయిలో) ఉండాలి.

అది గూడా సరిపోదు, …………దానిని విజయంరూపంలోకి మార్చడానికి తగిన ప్రయత్నం చేయాలి. 

అది గూడా ఏదో ఓ రంగంలో ప్రయత్నిస్తే సరిపోదు. ……………మన స్వభావానుకూలమైన రంగంలో మాత్రమే ప్రయత్నించాలి. 

అప్పుడు మాత్రమే మనకు visible success దొరుకుతుంది.

ఏవరిలోనైనా తగినంత Potentiality అనేది దీర్ఘకాలంలో మాత్రమే accumulate అవుతుంది. అది కూడా క్రమశిక్షణాయుతమైన జీవితం గడిపినప్పుడు మాత్రమే.

ఇన్నిషరతుల మధ్యన లభించే విజయం కొరకు మన ఆకాంక్షలమేరకు ప్రయత్నించడం అనేది మూర్ఖత్వం.

invisible success is unconditional

Potentiality కొరకు ప్రయత్నించినపుడు మాత్రం మనం బేషరతుగా సఫలీకృతులమవుతాము. దీనికొరకు క్రమశిక్షణాయుతమైన జీవితం చాలు. visible success కొరకు ఆత్రపడకుండా సహనంతో ఉంటే చాలు. 

మనలో పెంపొందుతున్న Potentiality మనకూ కనబడదు, ఈ లోకానికి కూడా కనపడదు. అందుకే దానిని సాధించడం అనేది Invisible Success.

మనం Potentiality సాధించిననాడే Success అయినట్లు లెక్క. Visible Success సాధించిన రోజు దానిని మనతోపాటు లోకం కూడా గుర్తిస్తుంది అంతే.

మన focus అంతా Potentiality accumulation మీద మాత్రమే ఉండాలి. మన సమయాన్ని అందుకొరకు మాత్రమే వెచ్చించాలి. Visible Success గురిచి పట్టించుకోకూడదు. ఎందుకంటే నీలో  తగిన Potentiality గనుక ఉంటే విజయం సహజసిద్ధమైన రీతిలో లభిస్తుంది, అప్రయత్నంగా లభిస్తుంది, దానంతటదే లభిస్తుంది. ఒకవేళ నీలో తగినంత Potentiality గనుక లేనట్లైతే నీవు ఎంత ప్రయత్నించి నా విజయం నీదరికి రాదు. కనుక దాని మీద దృష్టి పెట్టడం వ్యర్థం.

ఓ సారి విజయం లభించిన తరువాత కూడా నీవు దానిమీద దృష్టిపెట్టవలసిన పనిలేదు. దొరికిన విజయాన్ని పదిలపరచుకోవడం, మరింత విజయం పొందడం గురించి నీవు ఆలోచించవలసిన అవసరమే లేదు.  నీవు ఎల్లప్పుడూ నీ Potentiality పెంపు చేసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి.

అలా గనుక నీవు ఉన్నట్లైతే నీకు నీ జీవితంలో కొంత కొంత విరామంతో మరలా మరలా (time and again) విజయం లభిస్తూనే ఉంటుంది. 

అలాంటి విజయం ఏ స్థాయిలో ఉంటుందంటే నీవు కోరుకోవడానికి కూడా సాహసించనంతటి స్థాయిలో ఉంటుంది. నీవు కలగనడానికి కూడా ధైర్యం చేయలేనంతటి స్థాయిలో ఉంటుంది. నీవు లక్ష్యంగా నిర్దేశించుకున్న విజయం కన్నా ఎన్నోరెట్లు గొప్పగా ఉంటుంది.

Potentiality only matters, visible success doesn't matters

ఒకవేళ నీవు ఎలాంటి క్రమశిక్షణాయుతమైన గత జీవితం లేకుండా కేవలం Visible success మీద ఆశతో, దాని కొరకు ఆతురతతో ప్రయత్నించి సఫలీకృతుడైనట్లతే జన్మతః నీలో కొంత Potentiality ఉన్నట్లు లెక్క. అలాంటి సందర్భంలో ఆ Potentiality కాస్తా ఆ విజయంతో consume అయిపోతుంది. ఎటూ క్రమశిక్షణ లేదు కనుక ఆ ఒక్క విజయం కాలగతిలో fadeout అయిపోతుంది.

జీవితంలో జయాపజయాలు పొందడం అనేది వైకుంఠపాళి ఆట లాంటిది.ఈ ఆటలో మనం ఎంత క్రింది స్థాయిలో ఉన్నాకూడా మనలను అంతకన్నా పైస్థాయిలకు తీసుకువెళ్ళడానికి నిచ్చెనలుంటాయి. అలానే ఎంత పైస్థాయిలో ఉన్నాకూడా మనలను క్రింది స్థాయిలకు దిగలాడానికి పాములు ఉంటాయి. 

అలానే ఎన్ని విజయాలు పొంది, ఎంత ఉన్నత స్థానం చేరినాకూడా Potentiality అనేది accumulate అవడం ఆగిపోతే విజయాన్ని పొందడం అనేది అంతటితో ఆగిపోతుంది. విజయం పొదడం అనే ప్రక్రియ ఒకసారి ఆగిపోతే త్వరలోనే ఆ వ్యక్తి, లోకం దృష్టిలోfadeout అవడం అనేది జరిగిపోతుంది.

అలానే ఎన్నో అపజయాలెదురై ఎంతో క్రింది స్థాయిలో ఉన్నా కూడా మనలో సుగుణాలు గనుక ఉన్నట్లైతే కాలక్రమంలో Potentiality సంచయనం (accumulation) జరిగి అది విజయంగా రూపాంతరం చెందుతుంది.

కనుక మనం visible success మీద దృష్టి పెట్టడం మానేసి కేవలం potentiality accumulation మీద మాత్రమే దృష్టి (focus) పెట్టినట్లైతే, visible success అనేది మన జీవితంలో time and again సంభవిస్తూనే ఉంటుంది.

ఈ ప్రక్రియను మనం కేవలం మన ఆతురతకొద్దీ పాడు చేసుకుంటూ ఉంటాము.

ఇక చివరిగా కాలక్రమంలో Potentiality సంచయనం ఏకారణంగా జరుగుతుందో చెప్పుకుందాము.

క్రమశిక్షణ వలన అని చెప్పవచ్చు,

సుగుణాలవలన అని చెప్పవచ్చు,

విలువలతో కూడుకున్న జీవితం వలన అని చెప్పవచ్చు,

సాధన వలన అని చెప్పవచ్చు,

తపస్సు వలన అని చెప్పవచ్చు.

ఎలా చెప్పినాకూడా దీనిని సరైన అర్థంలో ఆచరించినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. పైన చెప్పిన మాటలకు ఎవరి అర్థాలు వారు చెప్పుకుని తమకు తోచిన అర్థంలో ఆచరిస్తే ఫలితం ఉండదు. కనుక ఆ సాధనా మార్గం గురించి సవివరంగా ప్రత్యేకంగా చర్చించుకుందాం. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి