Nice Guy vs Badass
వాస్తవవాది ఎదుటివ్యక్తిని బట్టి తన ప్రవర్తనను మార్చుకుంటాడు. కనుక వాస్తవవాదిని పక్కన పెట్టి మిగిలిన ఇరువురు సమాజంలో ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారో పరిశీలిద్దాం.
ఇది నాలుగు రకాలుగా ఉంటుంది.
A.ఆదర్శవాది - B.ఆదర్శవాది (A. Nice Guy - B. Nice Guy)
A.ఆదర్శవాది - B.అనాదర్శవాది (A. Nice Guy - B. Badass)
A.అనాదర్శవాది - B.ఆదర్శవాది (A. Badass - B. Nice Guy)
A.అనాదర్శవాది - B.అనాదర్శవాది (A. Badass - B. Badass)
ఉదాహరణకు A ని B విష్ చేసాడనుకుందాం. పైన పేర్కొన్న నాలుగు సందర్భాలలోనూ Dynamics వేరువేరుగా ఉంటాయి. వాటిని మనం ఓ సారి పరిశీలిద్దాం.
A. Nice Guy - B. Nice Guy
ఇక్కడ A & B ఇరువురూ Nice Guys అయిన పక్షంలో ఒక చక్కటి సుహృద్భావ సన్నివేశం ఆవిష్కరింపబడుతుంది.
A: తనను B గౌరవించినందుకుగాను సంతోషిస్తాడు, ప్రసన్నుడౌతాడు.
B: ఎదుటివారిని గౌరవించిన సంస్కారవంతుడవుతాడు.
A. Nice Guy - B. Badass
కానీ ఇక్కడ A Nice Guy అయి ఉండి B Badass అయిన పక్షంలో పరిస్థితి మరోలా ఉంటుంది.
A: తనను B గౌరవించినందుకుగాను ఎప్పట్లానే సంతోషిస్తాడు. జిత్తులమారి వాడిని నమ్మిన అమాయకుడు అవుతాడు.
B: విష్ చేయడం ద్వారా A తో rapport పెంచుకొని ముందు ముందు అతని ద్వారా తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్నదే B ఎత్తుగడ అయి ఉంటుంది.
A. Badass - B. Nice Guy
A: తన పాచికలు విసరడానికి Nice Guy అయిన B ని ఒక easy target గా నిర్థారించుకుంటాడు.
B: ఎప్పట్లానే తన సంస్కారం కొద్దీ ఎదుటివారిని గౌరవించాలనుకుంటాడు. అపాత్రుడిని గౌరవించిన వెర్రివాడవుతాడు.
A. Badass - B. Badass
A: తనతో ఏదో అవసరం ఉన్నది గనుకనే B తనకు నమస్కరించాడని భావించి, అతడిని అవమానించే విధంగా ప్రతినమస్కారం కూడా చేయకుండా ఏమీ గమనించనట్లు వెళ్ళిపోతాడు.
B: తన పప్పులు A దగ్గర ఉడకవని తెలుసుకుని మరోసారి అతని దగ్గర తన అతి తెలివితేటలు ప్రదర్శించడు.
పెద్దలను గౌరవించవలెను అనే కోణంలో మరో ఉదాహరణను పరిశీలిద్దాం
ఆదర్శవాదం (Idealism) ప్రకారం మనం పెద్దలందరినీ గౌరవించాలి. పెద్దరికం గలిగిన పెద్దలున్నంతవరకు ఈ నీతి ఎంతో హర్షణీయం. కానీ ఆదర్శవాదం అనేది పెద్దరికంలేని పెద్దలుండే పరిస్థితిని అసలు ఊహించదు. వారితో ఎలా ఉండాలో చెప్పదు.
సరిగా ఈ కారణంచేతనే Cynicism యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఈ అనాదర్శవాదం (Cynicism) పేరుకే పెద్దలు.. వారిలో పెద్దరికమనేదే ఉండదు.. కనుక వారిని గౌరవించాల్సిన పనిలేదని వాదిస్తుంది. పెద్దరికం కలిగిన పెద్దలుంటారనే విషయాన్ని Cynicism గుర్తించదు. వారిని గౌరవించాలని చెప్పదు.
ఇక వాస్తవవాదం (Realism) పెద్దరికమున్న పెద్దలను గౌరవిస్తుంది, అదిలేనివారిని గౌరవించదు.
పెద్దరికమున్న పెద్దలు, వారిని గౌరవించగలిగే సంస్కారమున్న పిన్నలు; ఈ ఇరువురూ ఒకచోట తటస్థపడితే హర్షణీయమైన సన్నివేశం ఆవిష్కరింపబడుతుంది. వారు సమాజంలో బుధజన సమూహంగా కీర్తింపబడతారు. ఇటువంటి విలువలున్న ప్రదేశాన్నే లక్ష్మి తనకు నిలయంగా మార్చుకుంటుంది.
కానీ దురదృష్టవశాత్తూ అన్ని ప్రదేశాలలో, అన్ని సందర్భాలలో ఇది సాధ్యం కాదు.
విలువలు లేనివారికి లక్ష్మి దూరంగా జరిగి పోతుంది. వారు పేదరికంలో మగ్గుతూ అలగాజనంగా పిలువబడుతుంటారు. వారిలో పెద్దరికమున్న పెద్దలు ఉండరు, సంస్కారమున్న పిన్నలూ ఉండరు.
ఆదర్శవాదం ప్రతీసారీ సాధ్యమవటం వాంఛనీయం, అభిలషణీయం;
అనేకసార్లు సాధ్యం కాకపోవడం ఒక విచారకరమైన వాస్తవం.
కనుకనే మనిషికి చిన్ననాటినుండి ఆదర్శవాదం మాత్రమే బోధింపబడుతుంది. అనాదర్శవాదం ఎప్పుడూ బోధింపబడదు. దానిని మనిషి కాలక్రమంలో వ్యవహారజ్ఞానం పెంపొందే కొలదీ, మానవ సంబంధాలలో అనుభవం పెరిగే కొలదీ స్వయంగా గ్రహిస్తాడు.
కనుక ఎవరైనా సరే తమ First Priority ని Idialism కే ఇవ్వాలి. పరిస్థితినిబట్టి Cynicism ని కూడా ఆచరించగలిగినవాడై ఉండాలి. అదే Realism అనిపించుకుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి