19, నవంబర్ 2015, గురువారం

కులమతాలు నేరమా?!

‘కులం’ అనేది ప్రాచీన సమాజంలో ‘పని విభజన ’ కొరకు ఏర్పడిందని అంటారు.

వాస్తవంగా కులం అనేది సమాజంలో ఒక ప్రత్యేక ప్రజాసమూహం తన స్వాభావికమైన విశిష్టతను నిలుపుకోవటం కొరకు, కాపాడుకోవటం కొరకు ఏర్పడింది. ఈ క్రమంలో ఒక్కొక సమూహం ఒక్కొక పనిని చేయడం ప్రారంభించింది.

కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ సమూహాలు ఒకేవిధమైన పనిని కూడా చేయవచ్చు.అప్పుడు కులానికి చేసేపనికి సంబంధం ఉన్నదని చెప్పలేము. ఉదాహరణకు కమ్మ-కాపు-రెడ్డి-వెలమ…ఇటువంటి కులాలు వేరు వేరైనా వీటి మధ్యన పని విభజనలేదు, ఉన్నది కేవలం సమూహ విభజన మాత్రమే.

అలాగే రాజ్యపాలనను క్షత్రియులేకాక అనేక శూద్రకులాల వారు, ఒక్కోసారి బ్రాహ్మణులు కూడా చేశారు.

అగ్రకులాలే కాదు, నిమ్న కులాలు కూడా తమ కులానికున్న విశిష్టతను కాపాడుకోవటానికే ప్రయత్నిస్తాయి. కనుక కులం అనేది దాదాపుగా అందరికీ అంగీకారమైన విషయమేగానీ అది అగ్రకులాలు మిగతా వారిమీద రుద్దిన విషయం కాదు.

ఇక మతమనేది మనిషి యొక్క జీవితకాలంలో జననం, విద్య, వివాహం, మరణం ఇత్యాది సందర్భాలలో జరగవలసిన కొన్ని శాశ్వతమైన ఆచారాలను నెలకొల్పడానికి, సంస్కారాలను రూపొందించడానికి ఏర్పడింది.

అలాగే మనిషి ఎటువంటి విలువలతో జీవించాలి? అతని జీవన లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనిషి ఎటువంటి విధానంలో, ఎటువంటి నడవడికతో జీవించాలి? మానవుని జీవితంలో భగవంతుని స్థానం ఏమిటి? ఆయన మనిషికి అతని జీవన గమనంలో ఏ విధంగా తోడ్పడతాడు?… ఇత్యాది వాటి గురించి మతం చర్చిస్తుంది.

ఈ మొత్తం విషయాలన్నిటి మీద ఏ మతానికి ఆమతం తన ప్రత్యేక అభిప్రాయాలను కలిగి ఉన్నది.

ఇక కులపరమైన, మతపరమైన విద్వేషాలంటారా…మనిషి మనసులో ‘ద్వేషం’ ఉన్నంతకాలం ఏదో ఒక ప్రాతిపదిక మీద ఇతరులను ద్వేషిస్తూనే ఉంటాడు. కులాలు, మతాలు రూపుమాసిపోతే మరో ప్రాతిపదికతో తోటి మనుషులను ద్వేషిస్తాడు. కనుక మనుషుల యొక్క మనసులు మారాలి! మనుషుల మనసులలో విద్వేషాన్ని రగిలించే పరిస్థితులు మారాలి!

ఈ వాస్తవాలను గ్రహించకుండా కేవలం చిలుక పలికినట్లుగా ‘మతాలు మాసిపోవాలి’, ‘కులాలు సమసిపోవాలి’ అనడం మూర్ఖత్వమే. మతాలకు, కులాలకు సర్వజనామోదయోగ్యమైన కొన్ని మౌలిక ఉద్దేశాలున్నాయి. కనుక సమస్యకు పరిష్కారం కనుగొనకుండా మూలకారణాన్ని అలానే ఉంచి మూర్ఖంగా ఇలా వాదించడం ఆదర్శవాదమనిపించుకుంటుందా? అసలు ఇది సమస్యను పక్కదారి పట్టించడం కాదా? ఇది సమస్యను మరింత తీవ్రం చేయటంకాదా?

‘కులాలు ఉండాలి…మతాలూ ఉండాలి.. కానీ అవి శాంతియుత సహజీవనం చేయాలి’. ఇదే అసలైన పరిష్కారం.

ఈ ఆదర్శవాదులలో కొందరి అసలు ఉద్దేశం మనుషుల యెడల ప్రేమ కాదు. వీరికేదో వ్యక్తిగత కారణాలతో కులమతాలు ఇబ్బందిగా పరిణమిస్తాయి.దానితో ‘తమ బాధ ప్రపంచం బాధ ’ అన్నట్లుగా ‘కులాలన్నీ కూలిపోవాలి, మతాలన్నీ మాసిపోవాలి’ అని పాడటం మొదలు పెడతారు. ఈ పాట విన్న కొందరు అమాయకులు ఇది ఆదర్శమేమో అని నమ్మి వీరిని అనుసరించి వారు కూడా ఆ పాటే పాడటం మొదలు పెడతారు.

అసలు మన సమాజంలో గాడ్సేలు పుట్టటానికి,చుండూరు, కారంచేడు లాంటి ఘటనలు జరగటానికి మరెవరో కారణం కాదు…వీరే! వీరి పక్కదారిపట్టిన ఆదర్శాలతో సమస్య యొక్క మూలం అలానే ఉండి అది పరిష్కారం కాకపోగా మరింతగా విద్వేషాగ్నిని రగులుతుంటుంది. వీరు సమస్యను వాస్తవ దృష్టితో చూడ నిరాకరించిన కొలదీ అది మరింత తీవ్రంగా తనను తాను అభివ్యక్తీకరించుకుంటూ ఉంటుంది.

ఒక వర్గం, మరో వర్గం మీద కులమో,మతమో ఏదో ఒక ప్రాతిపదిక మీద దాడికి పాల్పడితే బాధిత వర్గం అదే ప్రాతిపదికతో ఆ దాడిని కాచుకోవడానికి, తిప్పికొట్టటానికి ప్రయత్నిస్తే అది ఎన్నటికీ తప్పుకాదు. పైగా అది ఆవశ్యకం….మరియు అనివార్యం కూడా.

“నువ్వు అగ్రకులానికి చెందిన వాడివి! నీ తాత ముత్తాతలు, నా తాత ముత్తాతలను అవమానించారు.. చిన్నచూపు చూశారు. అందుకని ఈ రోజు నిన్ను నేను అవమానిస్తాను.. చిన్నచూపు చూస్తాను. నిన్ను రోడ్డు మీదే పట్టుకుని కొడతాను..! నీవు ఏమన్నా దానికి పెడార్థాలు తీసి కొడతాను! నన్నేమైనా అంటే SC/ST కేసు పెడతాను!” అంటూ ఉంటే ఆ దాడిని అదే అగ్రవర్ణపు ఐడెంటిటీతో ఎదుర్కోవడం తప్పా?? అది అగ్ర వర్ణపు దురహంకారమా??

“నీవు హిందువువి! నీవు కాఫిర్‌వి! నీవు చేసే విగ్రహారాధన నాకు నచ్చడంలేదు! అందుకని నీ తలను నేను తీస్తాను! నీ స్త్రీలను చెరబడతాను! నీ దేశాన్ని ఆక్రమిస్తాను! నీ దేవాలయాలను నేలమట్టం చేస్తాను! నీ దేశంలో జనావాసాల మధ్యన బాంబులు పెడతాను!” అంటూ పాశవిక దాడికి పాల్పడితే ఆ దాడిని అదే హిందూ ఐడెంటిటీ తో ఎదుర్కోవడం తప్పా??… అది మతవాదమా??

ఈ రెండు సందర్భాలలోనూ మనకేమి అవగతమైనది. ఆదర్శవాదులుగా ఉందామనుకుని మనం కులం, మతం వద్దనుకున్నా మన మీద దాడి చేసేవారు వద్దనుకోనివ్వరు. మన ఆత్మ రక్షణకైనా మనం ఆ ఐడెంటిటీని కలిగి ఉండాల్సిందే.

ఎందుకంటే… దాడి ఉన్నంతకాలం ప్రతిదాడి తప్పదు.

9 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. మీరన్నది నిజమే. అయితే మీరు ఈ వ్యాసాన్ని అగ్రవర్ణాలని, హిందువులనీ వెనకేసుకొచ్చే ఉద్దేశంతో రాసినట్లనిపిస్తుందేమిటబ్బా! మీ ఉదాహరణల్లో మరో రెండు వాక్యాలు చేరిస్తే వ్యాసానికో balance వచ్చేదేమో. 'కొందరు మూర్ఖులు చేసిన పనులకి దేశంలోని ముస్లిములనందరినీ బాధ్యుల్ని చేసి మేమంతా తీవ్రవాదులమన్నట్లు చూస్తుంటే ఎదురు తిరగటం తప్పా? అది మతవాదమా? ఈ దేశం మాది మాత్రం కాదా?' అనే మహమ్మదీయ స్వరాన్ని, అలాగే నిమ్న కులస్తుల ఆర్తినీ కూడా వినిపించుండాల్సింది.

    రిప్లయితొలగించండి
  3. కుమార్ గారు చలా బగా చెపారు. చలా మంచి విషయం . అసలు మనిషికి వెరొకడి మిద ద్వెషం ఉనపుడు దాని పలు రకాలు గా వ్యక్తపరుస్తాడు. కాసెపు కులం అంటాడు, కాసెపు మతం అంటాడు,కాసెపు ప్రాంతం అంటాడు,కాసెపు దనికులు పెదలు అంటాడు అది మనిషి నెజం. ఈ ఆదర్సవాదులు అసలు సమస్యని గుర్తించాలి. అలగె కులాని మతాని బటి మనుషులని విబజించటం మానాలి.

    రిప్లయితొలగించండి
  4. ఒక మనిషిని మనిషిగా చుదతం యలగొ మనిషికి నెర్పలి. వెరె మనిషిని మనిషిగా చుదలెకపొవటం ఒక రకమయిన మనసిక వైకల్యం అని తెలియ చెపాలి. అపుడు మాత్రమె మనిషి కి పసువుకి మద్య తెడా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  5. సమస్య కులం కాదు. కులవివక్ష, కుల విద్వేషం, కుల అహంకారం. అది "అగ్ర" కులాల్లో ఉన్నా,"నిమ్న" కులాల్లో ఉన్నా సమస్యే.కాకపోతే కొన్ని చారిత్రాత్మక అసమానతలకు ఇప్పుడు సమతౌల్యం జరుగుతోంది.


    మీ వ్యాసం నిస్పక్షంగా మొదలైనా హిందూఅగ్రకుల భావజాల పరంపరగా మారిందనిపించింది.

    రిప్లయితొలగించండి
  6. @ప్రశాంత్ గారు,

    వ్యాస శీర్షికలోని ‘నేరం’ రాజ్యాంగపరమైనదని కాదు నా ఉద్దేశం. కులమతాల ఉనికినే సహించలేని వారిని ఉద్దేశించి అన్న మాట అది.

    @అబ్రకదబ్ర గారు,

    ముస్లిములను, దళితులను వెనకేసుకొచ్చే ఆదర్శవాదులు ఇప్పుడు సమాజంలో చాలామందే ఉన్నారు. అందుకే నేను అగ్రవర్ణాలను, హిందువులను వెనకేసుకొచ్చాను. ఈ విధంగా నేను బాలెన్స్ చేద్దామనుకున్నాను. మీరు చెప్పిన బాలెన్స్ నా ఉద్దేశంలో లేదు. దానికి వివరణ చాలా పెద్దది.అయినా సంక్షిప్తంగా చెబుతాను.

    ఏ వర్గం వారైనా 100% దాడికి పాల్పడరు.ఒక దేశం మీదకు శత్రు దేశం దండెత్తినపుడే ఆ దేశ ప్రజలంతా కాక కేవలం సైన్యమే దానిని ఎదుర్కొంటుంది.అలానే ఒక వర్గంలో కొందరే దాడిలో పాల్గొంటారు. నూటికి నూరుపాళ్ళు పాల్గొన్నపుడు మాత్రమే ఆ వర్గాన్ని మనం తప్పు పట్టాలంటే అది సరికాదు.

    దీనికనుగుణంగా ఆ దాడి తరచుగా, సార్వత్రికంగా జరుగుతుంటే జనరలైజేషన్ తప్పదు. ఒకటి రెండు సంఘటనల ఆధారంగా జనరలైజేషన్ చేయటం మాత్రం మీరన్నట్లుగా తప్పు.దీనిని బట్టి మన దేశంలో ముస్లిం వర్గాల దాడులు ఏ విభాగానికి చెందుతాయో మీరే ఊహించుకోండి.

    ఛత్రపతి శివాజీ నుండి సంఘ్ పరివార్ వరకూ హిందువుల ధోరణి దాదాపుగా డిఫెన్సే.

    “ఈ దేశం మాది మాత్రం కాదా?” “నిమ్నకులాల ఆర్తి”…. వీటికి సమాధానం నేను మరో టపాలో ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.

    @శివ రాజేష్ గారు,

    ధన్యవాదాలు.

    @ మహేష్ కుమార్ గారు,

    వివక్ష,విద్వేషం,అహంకారం… వీటన్నింటిని మనిషి కట్టుకున్న భార్య మీదా ప్రదర్శిస్తున్నాడు, తోడబుట్టిన అన్నదమ్ముల మీద కూడా చూపిస్తున్నాడు. మరలాంటప్పుడు కులాన్నే ఎందుకు పేర్కొనాలి?

    అనిపించడం కాదు… నా వాదన నిజంగా హిందూ అగ్రకుల భావజాలమే. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో వారేకదా బాధిత వర్గం!

    అయితే నేను ముస్లిముల యెడల,దళితుల యెడల ద్వేషాన్ని మాత్రం బోధించటం లేదు.

    రిప్లయితొలగించండి
  7. భార్యాభర్తల గొడవలూ, అన్నదమ్ముల విద్వేషాలూ వ్యక్తిగతం. కానీ కులం ఒక సామాజిక విధానం. ఆ విధానం వలన పుట్టిన వివక్ష కొందరికి అడ్వాంటేజ్ ని కల్పిస్తే మరికొందర్ని, అణగదొక్కివేసింది. అందుకే ఇప్పుడు ఈ అసహనం.అసహనం ఉందికాబట్టే ఈ చర్చలూ, పోరాటాలు.

    "బాధిత వర్గం" అనే ఒక్కమాటతో మీరు తరువాత చెప్పిన ద్వేషాలను బోధించడం లేదనే మాటకూ చుక్కెదురు. బాధితులెప్పుడూ చర్చలకోసం సామరస్యంగా పిలుపినివ్వలేరు, కారణం వారిలో నిబిడీకృతమైన కసి,కోపం అవి మొదట బోధించేది ద్వేషాన్నే. అలా కొంతకాలం గడిచిన తరువాతనే, కొంత స్థిమితపడి "మామూలుగా" మాట్లాడగలిగే స్థితివస్తుంది. ప్రస్తుత హిందూ అగ్రకుల భావజాలం మొదటి మెట్టులో అదీ, పెద్ద అపోహలో ఉందని నాకనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  8. ఒక క్లిష్టమైన టాపిక్ మీద మంచి బాలన్సుతో రాసారు. ఒకటి మాత్రం నేను పూర్తిగా ఒప్పుకోను. అది ఈ వాక్యం. 'కులాలు ఉండాలి…మతాలూ ఉండాలి.. కానీ అవి శాంతియుత సహజీవనం చేయాలి’.

    ఎప్పుడో ఒకప్పుడు (అదెప్పుడో తెలీదనుకోండి) ఇవి పూర్తిగా పోవడమే ideal situation. ఐతే అది జరిగేలా లేదు కాబట్టి మీరు సూచించిన విధానం ప్రస్తుతం ఆమోదయోగ్యం.

    రిప్లయితొలగించండి