22, జులై 2020, బుధవారం

యోగభావనలు (Concepts of Yoga ) - 9

Physical Result - Potential Resultమనం ఒక పని చేసినపుడు దానికి రెండు రకాల ఫలితాలు ఉంటాయి.

ఒకటి Physical Result.

ఇది పైకి కనిపించే ఫలితం. దీని వలన కలిగే లాభనస్టాలను మనం తక్షణం పొందుతాము. అసలు ఎవరైనా దీనికొరకే ఏ పనినైనా చేస్తారు. 

రెండవది Potential Result.

ఇది పైకి కనిపించదు. వివేకవంతులు మాత్రమే దీనిని చూడగలరు. దీని వలన కలిగే లాభనస్టాలను మనం కొంతకాలం గడిచిన తరువాత పొందుతాము. అప్పటి వరకు ఇది Reserve రూపంలో ఉంటుంది. కానీ ఇదే అసలైన ఫలితం. మన తలరాతను నిర్దేశించే ఫలితమిదే.

కనుక ఏపని చేసినా ముఖ్యంగా Potential Result మీద దృష్టి ఉంచి ఆపని చేయాలి.

ఓ పని చేసినపుడు Physical Gain ఒక వంతు ఉండి Potential Loss నాలుగు వంతులు ఉందనుకోండి. ఆపనిని ససేమిరా చేయకూడదు.

కానీ Vision లేనివారు Potential Formలో ఉండే లాభనష్టాలను చూడలేరు. వారు పైకి కనిపించే Physical Gain మాత్రమే చూసి ఆ పనిని చేస్తారు. కానీ కాలాంతరంలో నష్టపోతారు.

ఉదాహరణకు ఓ సంసారి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడు అద్దె కొంచెం ఎక్కువ పెట్టి, ఓ మంచి ప్రదేశంలో ఇల్లు తీసుకోగలిగిన స్థోమత ఉండి కూడా తక్కువ అద్దె అనో, పని ప్రదేశానికి దగ్గరనో మంచి వాతావరణం కాని చోట ఇల్లు తీసుకున్నాడనుకుందాం.

దాని వల్ల అతనికి మిగిలే డబ్బు అతడి Physical gain.

కానీ అక్కడి చెడు వాతావరణం వలన అతడికి కలిగే నష్టం Potential loss.

ఈ నష్టం అతడికి కలిగే కొద్ది లాభం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అతడి పిల్లలు చెడు సావాసాలకు లోనౌతారు. దురలవాట్లకు బానిసలౌతారు. తమ భవిష్యత్తును పాడు చేసుకుంటారు. చివరకు అతడి కుటుంబమే అస్తవ్యస్తమైపోతుంది.

అలాగే మరో ఉదాహరణ.

ఓ ఇల్లాలు ఆఫీసుకు పోయి ఉద్యోగం చేస్తే ఆమెకు వచ్చే జీతం ఆమె Physical gain.

గృహిణిగా ఇంట్లో ఉండి తన పూర్తి సమయాన్ని తన కుటుంబ సభ్యుల కొరకు వినియోగిస్తే ఆమె ఉద్యోగం చేయడంద్వారా కలిగే ఆర్దిక ప్రయోజనాన్ని కోల్పోతుంది. కానీ అంతకు మించి ఎన్నోరెట్లు Potential gain ఆ కుటుంబం మొత్తానికీ కలుగుతుంది.

కనుక ఏమి చేయాలనేది ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. స్థోమత గనుక ఉంటే ఏ ఇల్లాలి కైనా గృహిణీధరాన్ని నిర్వర్తించడమే లాభదాయకం.

ఓ దురాశాపరుడైన వ్యాపారి నాణ్యతలేని సరుకులు, కల్తీ సరుకులు అమ్మినపుడు అతడికి కొంత ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. కానీ అతడు చేసినది తప్పు కనుక ఆ Physical gain కన్నా ఎన్నోరెట్లు Potential lossను అతడు మూటకట్టుకుంటాడు. కాలాంతరంలో ఆ నష్టాన్ని అతడు అనుభవించక తప్పదు.

(Physical Result, Potential Resultలలో ఒకటి gain అయితే రెండవది loss అవుతుందనేం లేదు. 

అలానూ జరగవచ్చు, లేదంటే రెండూ gain అవవచ్చు, లేదంటే రెండూ loss కూడా అవవచ్చు. సందర్భాన్ని బట్టి ఎలాగైనా జరగవచ్చు.

ఉదాహరణకు విద్యార్జన చేయడం వలన Physical gain మాత్రమే కాదు, Potential gain కూడా ఉంటుంది. 

అలానే చెడుస్నేహాలవలన Physical loss మాత్రమే కాదు, Potential loss కూడా ఉంటుంది. )

ఓ పని చేసినపుడు తక్షణం సిద్దించే ప్రయోజనం (Physical gain) స్వల్పమైనదే కాక కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కానీ ముందు Potential from లో Reserve గా ఉండి కాలాంతరంలో మనకు సిద్దించే ప్రయోజనం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటమేకాక చిరకాలం నిలచి ఉంటుంది.

కనుక పైకి కనిపించే లాభం మీద, తక్షణం సిద్దించే ప్రయోజనం మీద కాక కాలాంతరంలో అనివార్యంగా సిద్దించే, ఎన్నోరెట్లు ఎక్కువగా ఉండే ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఏ పనినైనా చేపట్టాలి.

కర్మసిద్ధాంతం నమ్మేవారు ప్రారబ్దం అన్నా, సంచిత ఫలం అన్నా వారు మాట్లాడుతున్నది Potential Result గురించి మాత్రమే.

జనసామాన్యం పాపం-పుణ్యం, ఖర్మ, తలరాత అన్నప్పుడు కూడా వారు మాట్లాడుతున్నది  Potential Result గురించి మాత్రమే.

కాకపోతే ఆ మాటలను తరతరాలుగా వినీ వినీ అలవాటైపోయి వాటిని మూఢత్వంగా భావించడం మనకు మామూలైపోయింది.

వాటిని నమ్మేవారు కూడా పరిమితార్థంలోనే వాటిని అర్థం చేసుకుంటున్నారు.

యోగభావనలన్నీ ప్రతి భారతీయుడికీ కొట్టిన పిండి. కాకపోతే వాటిని శాస్త్రీయంగా, ఓ క్రమపద్దతిలో అధ్యయనం చేయకుండా పడికట్టు మాటలరూపంలో వినడంవలన ఇలాంటి పరిస్థితి దాపురించింది.  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి