9, జనవరి 2024, మంగళవారం

BOND - PROGRESS - CHANGE
బంధం - వృద్ధి - మార్పు

(BOND - PROGRESS - CHANGE)    మనిషి జీవితంలో సాధించవలసిన వాటిలో ఎక్కువమంది వృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వృద్ధి అంటే సామాజికమైన విజయం. ధనాన్ని, గుర్తింపుని సాధించడం. 


    మనిషి తన ప్రాధమిక అవసరాలను తీర్చుకోవడానికి, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి కావలసిన వస్తు సదుపాయాలను సమకూర్చుకోవడానికి ధనార్జనకు పూనుకుంటాడు. ఆ క్రమంలోనే సామాజిక కార్యకలాపాలలో తన వంతు పాత్రను కూడా పోషిస్తాడు. ఒక స్థాయికి చేరేవరకు మనిషి తనకున్న సమయంలో, శక్తిలో సింహభాగం దీనికే కేటాయిస్తాడు. ఇంతవరకూ ఎవరికైనా తప్పదు. (కొందరు జీవితాంతం కష్టపడినా ఇంతవరకూ కూడా చేరుకోలేరు. అది వేరే చర్చ) దీనితో మనిషి ఆర్ధిక కష్టాలు తీరతాయి. సామాజికంగా గుర్తింపు, గౌరవం దక్కుతాయి. ఇలా విజయం సాధించినవారిలో ఎక్కువమందికి ఆ గుర్తింపు, గౌరవం ఒక వ్యసనంగా మారతాయి. దీనితో అలాంటి గుర్తింపునివ్వని జీవితపు మిగతా అవసరాలను నిర్లక్ష్యం చేయనారంభిస్తాడు.  


    నిజానికి ఆర్ధిక సమస్యల కన్నా, ఏ గుర్తింపు లేని అనామకత్వపు అవమానాల బాధ కన్నా ఎక్కువ సమస్యలు, ఎక్కువ బాధలు మనిషికి ఇతరులతో తనకున్న బాంధవ్యాల కోణం నుండి కలుగుతాయి. ఐతే ఆ బాధలు చుట్టుముట్టేవరకు వాటి గురించి ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవడానికి,  సమాజంలో తన వంతుపాత్ర పోషించడానికి ధనార్జన చేయక తప్పదు. కానీ అటువంటి ప్రేరేపకమేదీ మనిషికి బాంధవ్యాల కోణంలో ఉండదు. అందుకే దానిని నిర్లక్ష్యం చేస్తాడు.


    మనిషికి ఆర్ధికేతరంగా ఒక్క బాంధవ్యాలకోణంలోనే కాక మరో కోణం నుండి కూడా సమస్య ఎదురౌతుంది. అదే కాలంతో పాటు మారలేకపోవడం.
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి