యోగశక్తి సంచయనం
(Accumulation of Cosmic Energy)
శక్తి ప్రతీ క్షేత్రంలోనికీ ఎంతో కొంత మొత్తంలో తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకొంటుందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం.
ఈ కారణంగా ప్రతీ ప్రదేశంలోనూ స్వతఃసిద్ధంగా ఎంతోకొంత శక్తి ఉంటుంది. అలా ఉన్న శక్తి వలన ఏ ప్రదేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు లభించదు. ఎందుకంటే అది సాధారణమైన పరిమాణంలోనే ఉంటుంది. ఆపాటి శక్తి అన్ని ప్రదేశాలలోనూ ఉంటుంది. ఒక ప్రదేశంలోని శక్తి పరిమాణం అసాధారణంగా వృద్ధిచెందినపుడే ఆ ప్రదేశం తేజోవంతమై అది ఒక ప్రత్యేకమైన విలువను, గుర్తింపును సంతరించుకొంటుంది.
శక్తి ప్రతీ ప్రదేశంలోనికీ తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకుంటుందనే ధర్మాన్ని ఆసరాగా చేసుకొని మానవుని నియంత్రణలో ఉన్న ప్రదేశాలలోనికి చేరిన శక్తిని కొన్ని సాధనలద్వారా పెంపు చేయడం ద్వారా మానవుడు శక్తివంతుడు కాగలడు.
ఇలా ఆర్జించిన యోగశక్తిని ఓజోశక్తి అనీ, కుండలినీశక్తి అనీ రకరకాలుగా పిలుస్తారు. ఈ శక్తి కలిగిన మానవుడిని ఓజోవంతుడనీ, వీర్యవంతుడు అని పేర్కొంటారు.
ఈ సాధనలలో సన్మార్గమైనవీ ఉన్నాయీ, దుర్మార్గమైనవీ ఉన్నాయి. సన్మార్గంలో చేసే సాధనలు ఫలించడానికి దీర్ఘకాలం పడుతుంది. అందుకే కొందరు దురాశాపరులు స్వల్పకాలంలో ఫలితాలనందించే అడ్డదారులలో శక్తి సముపార్జనకు పూనుకుంటారు.
సన్మార్గంలో శక్తిని ఆర్జించడానికి దీర్ఘకాలం సాధన చేయవలసి ఉంటుంది. దీనికొరకు ప్రాచీన భారతదేశంలో తపస్సు అనే వ్యవస్థీకృత సాధనా రూపం ఉండేది. దీనిని బుధజనులైన ఋషులు, మునులు ఆచరించి శక్తిని ఆర్జించేవారు. ఇది శక్తిని ఆర్జించడానికి ఒక శాస్త్రీయ సాధన ...ఒక Full time Job.
తపస్సు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నట్లైతే శాస్త్రీయంగా తపస్సు చేయకపోయినప్పటికీ తపస్సులో భాగమైన అంశాలను ఆచరించడం ద్వారా సమాజంలో ఒకరిగా ఉంటూ సాధారణమైన కుటుంబజీవితం గడిపేవారు కూడా శక్తిని ఆర్జించవచ్చు.
ఆ ప్రకారంగా చాలా సులువైన మార్గంలో, సులభమైన పద్దతిలో ఈ శక్తిని మనం స్వంతం చేసుకోవచ్చు. కావలసిందల్లా ఆకాంక్ష, పరిశీలన, విశ్వాసం మాత్రమే.
శక్తి అనంతమైనది, అపారమైనది. అది ఈ జగత్తులో ఎల్లెడలా విస్తారంగా వ్యాపించి ఉంటుంది. కానీ దానిలో మనం ఎంత వశం చేకున్నామన్నదాని మీదే మన శక్తి ఆధారపడి ఉంటుంది.
శక్తిని వశం చేసుకోవడానికి అనేక పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువ పద్దతులు దుర్మార్గమైనవి. అవన్నీ శక్తిని ఆర్జించడనికి ఉన్న అడ్డదారులు.
దురలవాట్లతో (పంచ మకారాలు: మద్యం, మాంసం, మత్స్యం, మిథునం, ముద్ర) కూడుకున్న తాంత్రిక సాధన,
పరపీడనతో (జంతుబలి, నరబలి) కూడుకున్న క్షుద్రపూజలు,
దురాశతో కూడుకున్న రసవాదం.
ఇటువంటివన్నీకూడా శక్తినార్జించే మార్గాలుగా ప్రచారంలో ఉన్నాయి.
కానీ ఇటువంటి దుర్మార్గమైన పద్దతులను దిగజారిన మనుషులు, అన్నిరకాలుగా దిగువస్థాయి వ్యక్తులు మాత్రమే ఆశ్రయిస్తారు. బుధజనులు ఇటువంటి పద్దతులను కలలో కూడా తలంచరు.

శక్తి సముపార్జనకు బుధజనసమూహానికి ఆమోదయోగ్యమైన ఉత్తమ మార్గం సదాచరణ. ఇది మనుషులను శక్తివంతులను చేయటమేకాక సకలజనులకూ మేలు చేసి, ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిస్తుంది.
శక్తివంతులైన వ్యక్తులు శక్తివంతమైన కుటుంబాలను నిర్మిస్తారు.
శక్తివంతమైన కుటుంబం శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది.
శక్తివంతమైన సమాజం శక్తివంతమైన జాతిని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తుంది.
శక్తివంతమైన దేశం శక్తివంతమైన ప్రపంచాని నిర్మిస్తుంది.
శక్తివంతమైన కుటుంబం శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది.
శక్తివంతమైన సమాజం శక్తివంతమైన జాతిని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తుంది.
శక్తివంతమైన దేశం శక్తివంతమైన ప్రపంచాని నిర్మిస్తుంది.
సదాచారమే శక్తికి మూలం!
సదాచరణే ఈ యోగశక్తిని సంచయనం చేసే (శక్తిని వశం చేసుకోవడానికి) ఉత్తమ మార్గం.
సదాచరణే ఈ యోగశక్తిని సంచయనం చేసే (శక్తిని వశం చేసుకోవడానికి) ఉత్తమ మార్గం.
సదాచారాన్ని పాటించే మానవుడు శక్తివంతుడవుతున్నాడు ...వీర్యవంతుడవుతున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి