మొదటి అధ్యాయం : ప్రపంచ చారిత్రక, రాజకీయ పరిణామాల సంగ్రహ అధ్యయనం
మానవుడు తన ఐహిక జీవితంలోని బాధలకు పరిష్కారాన్ని సాధించటం కొరకు సమస్త మానవ జాతిని ఉద్దేశించి ఒక చక్కని రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పరచాలని ఎన్నో శతాబ్దాలనాడే ప్రయత్నాన్ని ప్రారంభించాడు.ఐతే అప్పటికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు ప్రతిక్రియే పరిష్కారం అనుకొని పొరబడటంవలన, దానినే పరమ సత్యంగా ప్రచారం చేయటం వలన మానవుడు తన అన్ని ప్రయత్నాలలోనూ విఫలం చెందాడు.
ఈ ప్రయత్నానికి పూర్వం మానవుడిలో మానవ జాతినంతటినీ ఉద్దేశించిన రాజకీయ, సామాజిక లక్ష్యాలు ఏవీ ఉండేవి కావు. ప్రపంచంలోని అన్ని నాగరిక జాతుల మధ్యన వ్యాపార వాణిజ్యాల్లాంటి పరస్పర చర్యలు జరుగుతున్నా కూడా ఏజాతికాజాతి తమతమ సామ్రాజ్యాలను ఏర్పరచుకొని ఏకాంతంగా మనుగడ సాగిస్తుండేవి. పైగా అప్పట్లో మానవుడు మతపరంగా ఆలోచిస్తూ ఉండేవాడు. భారతదేశంలో, చైనాలో, ఐరోపాలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలుండేవి.ఐతే అవేవీ కూడా సమస్త మానవాళినుద్దేశించి రాజకీయంగా ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. చైనాలో కన్‌ఫ్యూషియస్, దూరప్రాచ్యంలో క్రిస్టియానిటీ, భారతదేశంలో బౌద్ధ,జైన మతాలు జన్మించి వ్యాప్తినొందాయి.
అలెగ్జాండర్ లాంటి చక్రవర్తులు ప్రపంచాన్ని జయించాలని తలపెట్టినా అది ప్రధానంగా వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠలకోసం చేసిందే కానీ మానవజాతిని ఉద్ధరించాలనిగానీ, మానవాళి సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఏదైనా సైద్ధాంతిక నేపథ్యంతో కానీ జరిగినది కాదు. అంటే మానవుడు ఆ సమయంలో పారమార్థిక చింతననుండి ఐహిక చింతనకు మరలే- అంటే రాజకీయ సామాజిక వ్యవస్థను నెలకొల్పే- పరిణామం అప్పటికింకా జరగలేదు.
ఇస్లాం ఆవిర్భావం
ఐతే ఈ పరిణామం తదనంతరకాలంలో ఒకనాడు హఠాత్తుగా జరిగినది. అదే ఇస్లాం ఆవిర్భావం.ఇది క్రీ||శ.7వ శతాబ్దపు ప్రథమార్ధంలో సంభవించినది.
అరేబియా దేశంలో క్రీ||శ.570వ సం||లో మక్కా అనే పట్టణంలో ఇస్లాం స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మించాడు. నడి వయసు వరకు సాధారణ జీవితాన్నే గడిపిన ఈయన కాలక్రమంలో ఆధ్యాత్మికంగా మారటంతో ఒకనాడు ధ్యాన సమయంలో జ్ఞానోదయమైనది. అప్పటి వరకు అరేబియన్‌లు మక్కాలోగల 360 విగ్రహాలను మరియు 'కాబా ' అను నల్లని రాతిని పూజించేవారు. మహమ్మద్ ప్రవక్తకు కలిగిన జ్ఞానోదయం ప్రకారం 'అల్లా ఒక్కడే దేవుడు. అతనికి మాత్రమే అందరూ విధేయులై ఉండాలి '.కనుక ఈ విధంగా లెక్కకు మిక్కిలిగా విగ్రహాలను పూజించకూడదు. అసలు విగ్రహారాధనే చేయకూడదు. తాను ఆ దేవుని సందేశాన్ని మానవాళికి అందించటానికి అవతరించిన అంతిమ ప్రవక్త.అంటే తన తరువాత ప్రవక్తలెవరూ ఉదయించరు.తన సందేశమే అంతిమ సందేశం.
ఐతే తన స్వంత పట్టణమైన మక్కాలో ఈయన బోధనలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవటంతో ఈయన తన అనుచరులతో క్రీ||శ.622సం||లో మదీనా అనే పట్టణానికి చేరుకున్నాడు.అచ్చట ఈయన బోధనలకు ఆదరణ లభించడంతో తన ఉద్యమాన్ని అచటినుండే ప్రారంభించాడు. మక్కా నుండి మదీనాకు మహమ్మద్ ప్రవక్త చేరుకున్న ఈ సంఘటననే ఇస్లాం ఆవిర్భావంగా పరిగణిస్తున్నారు.
క్రీ||శ.632 లో మహమ్మద్ ప్రవక్త మరణించారు.అప్పటి వరకు అనేక దేవతలను ఆరాధిస్తూ దానికి తగినట్లుగానే ఐకమత్యంలేక చిన్న చిన్న విషయాల దగ్గర తమలోతాము కలహించుకొని రక్తపుటేరులు పారించిన అరేబియన్ తెగలు ఈయన బోధనల ప్రభావంతో ఇస్లాం ఛత్రం క్రింద ఒక్కటైనవి. ఈయన మరణానంతరం వీరంతా మహోత్తుంగతరంగం వలే ఉద్యమించటంతో ఇస్లాం ప్రపంచంలోని అనేక దేశాలలో ఆశ్చర్యకర వేగంతో విస్తరించినది.
ఇస్లాం కేవలం ఒక మతమా..?!
ఇస్లాం ప్రధానంగా మతం కాదు. అది మానవాళినంతటినీ ఉద్దేశించిన ఒక రాజకీయ సామాజిక వ్యవస్థ. ఇస్లాం క్రిస్టియానిటీ, బౌద్ధం, కన్‌ఫ్యూషియస్ మొదలైనవాటి సరసన పేర్కొనదగిన మతమా..? లేక కాపిటలిజం,కమ్యూనిజం మొదలైనవాటి సరసన పేర్కొనదగిన రాజకీయ సామాజిక వ్యవస్థా..?అనే సమస్య మనకెదురైతే రెండవ అభిప్రాయమే అన్నివిధాలా సరియైనది.ఇస్లాం దాని యొక్క తీరు తెన్నుల వలన మనకు ఒక మతంలా గోచరిస్తున్నది.కనుక ఇప్పటి వరకూ మన అవగాహనలో ఇస్లాంను ఒక మతంగానే స్వీకరిస్తున్నాము. దీనిని మొదట మనం మార్చుకోవాలి.
మతం అన్నది ఏదైనా మానవుడు దానిని ఐచ్ఛికంగా అవలంబించేటట్లుగా ప్రేరేపిస్తుంది. శాంతియుతంగా బోధిస్తుంది. మతాన్ని మానవుడు దైవభక్తి, పాపభీతి మొదలైనవాటితో స్వయంప్రేరితుడై ఆచరిస్తాడు. కానీ ఇస్లాం మానవుడిని బలవంతంగా ఆచరించేటట్లుచేస్తుంది. అలానే మతం మానవుని వ్యక్తిగతజీవితంలో జోక్యం చేసుకోదు. వస్త్రధారణ, స్త్రీలకు ఈయవలసిన స్వేచ్ఛ, ఇంకా మానవుడి వ్యక్తిగత నైతిక ప్రవర్తన ఇత్యాది విషయాలలో మతం జోక్యం చేసుకోదు. అవన్నీ సమాజంలో నెలకొన్న సమకాలీన ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలగు వాటిద్వారా నిర్దేశింపబడతాయి. కానీ ఇస్లాం వీటన్నింటిలోనూ జోక్యం చేసుకుంటుంది. అన్ని విషయాలలోనూ కొన్ని విధివిధానాలను ఏర్పరచి వాటిని బలవంతంగా ఆచరించేటట్లు చేస్తుంది. ఇటువంటి బలవంతం మతలక్షణం కాదు. ఇది శాసనాధికారంగల రాజ్యశక్తి యొక్క లక్షణం మాత్రమే.
క్రైస్తవం, బౌధ్ధం, జైనం, యూదుమతం, జొరాష్ట్రియనిజం, కన్‌ఫ్యూషియస్ మతం ఇవేవీ కూడా తమ బోధలను ఆచరించేటట్లుగా మానవుడిని బలవంతం చేయలేదు. మతబోధలు ఆదేశ సూత్రాల్లా ఉంటాయేగానీ శాసనాల్లా ఉండవు. కానీ ఇస్లాం మానవుడిని శాసిస్తుంది. ఏ మతం కూడా ప్రత్యక్షంగా రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. కానీ ఇస్లాం అలా చేపట్టింది.కాబట్టి ఇస్లాం అనేది తనయొక్క ప్రగాఢమైన దైవ విశ్వాసం వలన ఒక మతంలా గోచరిస్తున్నా ఈ లక్షణాలన్నింటిని బట్టి ఇస్లాంలో అంతర్లీనంగా ఉన్న తత్వం ఒక రాజకీయ, సామాజిక వ్యవస్థ అని మనం నిర్థారణ చేయవచ్చు.
ఈ రచనలో చెప్పినంత రూఢీగా కాకపోయినా ఇస్లాం గురించి చరిత్రకారులలో ఇటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఐతే వారు చరిత్రను పరిశీలించే దృక్కోణం వేరుకనుక ఇంత ఖచ్చితంగా చెప్పిఉండకపోవచ్చు. మనం ఒకానొక ప్రామాణిక గ్రంథంలో వెలువరించిన అటువంటి అభిప్రాయాన్ని ఒకదానిని పరిశీలిద్దాం.
Traditionally, Islam has been regarded by its followers as extending over all areas of life, not merely those (such as faith and worship) which are commonly viewed as the sphere of religion today. Thus many Muslims prefer to call Islam a way of life rather than a religion. It is for this reason too that the word Islam, especially when reffering to the past, is often used to reffer to a society, culture or civilization, as well as to a religion. While a history of Christianity will usually cover only matters relating to religion in a narrow sense, a history of Islam may discuss, for example, political developments, literary and artistic life, taxation and landholding,tribal and ethnic migrations, etc. In this wider sense Islam is the equivalent not only of Christianity but also of what is often called Christendom.
ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం-ఇవి మూడూ కూడా కేవలం రాజకీయ ఉద్యమాలే కావు. అవి మానవుడి జీవనంలోని అన్ని కోణాలనూ స్పృశించిన జీవన విధానాలు. మానవుడు చరిత్రలో సాధించిన మూడు మహా నాగరికతలు. సామ్యవాదం హేతువాద ప్రధానమైనది. ఇది ఒక నాస్తిక వాదం; భగవద్విశ్వాసాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మతాన్ని మత్తుమందుగా ఈసడించినది. కాపిటలిజం మాత్రం మధ్యేమార్గాన్ని అవలంబించినది.తనకు అడ్డురానంత వరకూ ఇది మతాన్ని వ్యతిరేకించలేదు.తనకు ఆటంకంగా పరిణమించినంతమేరా ఇది మతాన్ని సంస్కరించి అంతటితో సరిపెట్టినది.
ఇస్లాం మాత్రం భగవంతునిలో ప్రగాడమైన విశ్వాసాన్ని ప్రకటించినది. ఈ కారణం చేతనే ఇస్లాం ఓ మతంలా గోచరిస్తుంది. గోచరించడమేకాదు నిజానికి ఈ విశ్వాసం వలననే ఇస్లామిక్ వ్యవస్థలో మతం కూడా విలీనమైపోయి ఉన్నదని చెప్పవచ్చు. అందుకనే ఇస్లామిక్ వ్యవస్థలో జీవించే ప్రజలు ప్రత్యేకించి వేరే ఏ మతాన్నీ అవలంబించక ఇస్లాంనే ఓ మతంలా కూడా ఆచరిస్తుంటారు. అందువలననే ఇస్లాం అధికారంలో ఉన్నా లేకున్నా అది ఓ మతంలా ప్రజలలో నిలచిపోయింది. ఇస్లామిక్ వ్యవస్థలోని మతపరమైన అంశ ఒక అవక్షేపంలా మిగిలిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఐరోపా ప్రజలకు క్రిస్టియానిటీ ప్రత్యేకించి మతం పాత్ర పోషిస్తున్నది. ఇస్లామిక్ వ్యవస్థలో అలా కాదు. మతం పాత్ర కూడా ఇస్లామే పోషిస్తున్నది. ఇక సామ్యవాదంలో మత సమస్యే లేదు.....(సశేషం)
nenu telugu lo elanti blogs kosam vediki visiki poga mee blog(sankhavaram) kanabadindi sir.i love this blog
రిప్లయితొలగించండిThank you ramudu garu!
తొలగించండి