29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: అంకితం





రాజు - రాజ్యం



అంకితం

పీరో డి మెడిసి కుమారుడైన ఘనతవహించిన లొరెంజో డి మెడిసి కు





(unedited)


(లొరెంజో డి మెడిసి ఫ్లోరెన్స్‌ను 1513 నుండి 1519 వరకు పరిపాలించాడు. ఇతడు లొరెంజో ద మాగ్నిఫిషియెంట్ కు మనుమడు మరియు పీరో డి మెడిసి కు కుమారుడు. సింహాసనానికి సంబంధించి మాకియవెల్లి అతడికిచ్చిన సలహాలు, సూచనల సమాహారమే ఈ గ్రంథం.)


ఒక రాజును ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేవారు సాధారణంగా చాలా విలువైన వస్తువులతో గానీ, లేదా ఆ రాజు మిక్కిలి ఇష్టపడే వస్తువులతో గానీ అతడి ముందుకు రావడం ఆనవాయితీ. అందుచేతనే రాజులకు వారి గొప్పదనానికి తగిన గుఱ్ఱాలు, ఆయుధాలు, బంగారు వస్త్రాలు, విలువైన రత్నాలు ఇంకా ఇలాంటి విలువైన బహుమతులు బహూకరింపబడటం మనం తరచుగా చూస్తుంటాం.


అలాగే నేను కూడా నాకు తమ యందు గల భక్తి ప్రపత్తులను చాటుకుంటూ తమ సమక్షంలోనికి విచ్చేయాలని కోరుకుంటున్నాను. సమకాలీన వ్యవహారాలలో దీర్ఘానుభవం ద్వారానూ, ప్రాచీన చరిత్రను నిరంతరాయంగా చదవడం వల్లనూ పొందిన –గొప్ప వ్యక్తులు ఒనరించిన కార్యాలకు సంబంధించిన విజ్ఞానం– కన్నా నాకున్న వాటిలో నాకు ఎక్కువ ప్రియమైనది, నేను ఎక్కువ విలువనిచ్చేది మరోటి నాకు కనబడలేదు. ఆ విజ్ఞానాన్ని నేను ఎంతో జాగరూకతతో పరిశీలించి, సుదీర్ఘంగా యోచించిన తరువాత ఇప్పుడు ఈ చిన్న గ్రంథంగా కుదించి తమకు పంపుతున్నాను. ఈ రచన మీ గొప్పదనానికి తగినది కాదని నేను భావిస్తున్నప్పటికీ తమలోని దయాగుణం కారణంగా ఇది తమచే అంగీకరింపబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అనేక సంవత్సరాలలో, అనేక కష్టాలకు, ప్రమాదాలకు గురై నేను నేర్చుకున్నదంతా అతితక్కువకాలంలో అర్థం చేసుకునే అవకాశం తమకు కల్పించడం కన్నా మంచి బహుమతి ఇవ్వడం నాకు సాధ్యం కాదని అనుకుంటున్నాను.


అనేకమంది రచయితలు తమ రచనలకు అందచందాలద్దాలని కోరుకున్నట్లుగా నేను ఈ రచనను దీర్ఘమైన పదబంధాలతో అలంకరించలేదు, నాజూకైన, ఆడంబరమైన పదాలతో, మరి ఏ ఇతరమైన అనవసర (అక్కరలేని) ఆకర్షణలతో నింపివేయలేదు. ఎందుకంటే ఈ రచనలో ఉన్న విషయంలోని సత్యం, ఇందులోని అంశాల ప్రాముఖ్యత కారణంగానే దీనికి గౌరవం దక్కాలి, లేదంటే దీనికి ఎటువంటి గౌరవమూ దక్కకూడదు అని నేను కోరుకుంటున్నాను. (కున్నాను)


ఒక దిగువస్థాయి వ్యక్తి రాజులకు సంబంధించిన విషయాలను చర్చించి, కొన్ని నిర్ధారణలు చేయడానికి సాహసించడం తలపొగరని ఎవరైనా భావిస్తే వారితో నేను ఏకీభవించను. ఎందుకంటే, ప్రకృతిదృశ్యాలను చిత్రించేవారు పర్వతాలు, ఇతర ఎత్తైన ప్రదేశాల తీరుతెన్నుల్ని పరికించడానికి క్రిందనున్న లోయలోకి వెళతారు, లోయలను పరికించడానికి ఎత్తైనపర్వతాలపైకి వెళతారు. అదే విధంగా ప్రజలను అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి రాజుగా ఉండాల్సిన అవసరం ఉంది, అలాగే రాజులను గురించిన అవగాహన కలగాలంటే అతడు ప్రజలలో ఒకడై ఉండాలి.


కనుక ఈ చిన్న బహుమతిని నేను ఎటువంటి స్పూర్తితో తమకు అందిస్తున్నానో అదే స్ఫూర్తితో తమరు స్వీకరించండి. దీనిని తమరు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లైతే ఆ విధి, తమ స్వీయ అర్హతలు (స్వీయ ప్రతిభా విశేషాలు) తమకు హామీ ఇస్తున్న (తేగలిగిన) ప్రాభవాన్ని (ఎంత ప్రాభవాన్ని తేగలవో అంత ప్రాభవాన్ని) తమరు పొందాలనే నా ప్రగాఢ వాంఛను తమరు గుర్తిస్తారు. తమరు ఎప్పుడైనా తమ ప్రాభవ శిఖరాన్నుండి ఈ నిమ్న ప్రాంతాలకు తమ దృష్టిని సారించినట్లైతే నేను విధిచేసిన తీవ్రమైన, నిరంతరాయమైన గాయాలను ఎంత అపాత్రంగా భరించానో తమరు తెలుసుకుంటారు. 










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి